విద్యార్థి హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో
కర్ణాటక టీచర్స్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన విద్యార్థిని హాల్ టికెట్ పై ఆమె ఫొటోకు బదులుగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో ముద్రించారు. దీన్ని చూసి ఖంగుతున్న ఆ విద్యార్థిని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అందులో తన ఫొటోకు బదులుగా సన్నీ లియోన్ ఫొటో ఉండటాన్ని గుర్తించింది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ తోపాటు కర్ణాటక ప్రభుత్వ విద్యాశాఖ కూడా స్పందించాల్సి వచ్చింది.

అభ్యర్థి ఫొటోను తప్పుగా ముద్రించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. హాల్ టికెట్‌పై మాజీ పోర్న్‌స్టార్ ఫొటోను ఎలా ముద్రించారంటూ కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్‌పర్సన్ బీఆర్ నాయుడు రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే నీలిచిత్రాలు చూసే పార్టీ నుంచి ఇంతకుమించి మనం ఏం ఆశించగలమని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. సన్నీలియోన్ ఫొటో ముద్రించి ఉన్న హాల్ టికెట్‌ను నాయుడు షేర్ చేశారు.

కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ కార్యాలయం బదులిచ్చింది. హాల్ టికెట్ పై అభ్యర్థే ఫొటోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. వారు ఏ ఫొటోను అటాచ్ చేస్తే సిస్టమ్ అదే ఫొటోను తీసుకుంటుందని, వారు సన్నీలియోన్ ఫొటోను అప్ లోడ్ చేసివుంటారా? అనే కోణంలో అభ్యర్థిని గురించి వాకబు చేశామని తెలిపింది. అయితే ఆమె భర్త స్నేహితుడు ఒకరు అప్ లోడ్ చేశారని తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఆ ఫొటోను ఎవరు అప్ లోడ్ చేశారో తేలిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications