Super Star: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ఆశీర్వాదం తీసుకున్న సూపర్ స్టార్, థ్యాక్స్ చెప్పాను !
న్యూఢిల్లీ/చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్, బహుబాష నటుడు, తలైవా రజనీకాంత్ దంపతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మెదీని కలిశారు. ఇటీవల దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్ ఆయన సతీమణితో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తన సతీమణితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశానని, తనకు చాలా సంతోషంగా ఉందని, దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పానని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన అధికారిక సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీతో సూపర్ స్టార్ దంపతులు పలు విషయాలపై చర్చించారని తెలిసింది.

వెంకయ్యనాయుడి చేతుల మీదుగా అవార్డు
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు దేశ విదేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సినిమా రంగంలో రజనీకాంత్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే ఆయనకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించింది. ఇటీవల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఢిల్లీలో దాదా సాహెబ్ పాల్కే అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు.

రాష్ట్రపతితో భేటీ అయిన సూపర్ స్టార్
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి మర్యాదపూర్వకంగా కలిశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. సినిమా రంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ విశేషసేవలు అందిస్తున్నారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ సందర్బంగా ఆయన్ను అభినందించారని తెలిసింది.

ప్రధాని మోదీతో రజనీకాంత్ దంపతులు
న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని రజనీకాంత్ ఆయన సతీమణితో కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి కుర్చున్న రజనీకాంత్ ఒకరి ఆరోగ్యం గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఇదే సమయంలో వివిద విషయాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ సూపర్ స్టార్ రజనీకాంత్ చర్చించారని తెలిసింది. రజనీకాంత్ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫోటోలు తీసుకున్నారు.

సంతోషంగా ఉందని చెప్పిన రజనీకాంత్
ప్రధాని నరేంద్ర మోదీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవడం చాలా సంతోషంగా ఉందని, దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇచ్చినందుకు రాష్ట్రపతికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపానని వివరిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన అధికారిక సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు.

మోదీ అంటే రజనీకాంత్ కు అభిమానం ఎక్కువే
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత ఆయన ప్రతి పుట్టిన రోజునాడు రజనీకాంత్ సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత ఏరోజు కూడా రజనీకాంత్ ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని బీజేపీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఎలాంటి విమర్శలు చెయ్యలేదు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేసిన సమయంలో ఆయన పనితీరును మెచ్చుకున్న రజనీకాంత్ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు.

రజనీకాంత్ ఆ చాన్స్ మాత్రం ఇవ్వలేదు
రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన సమయంలో బీజేపీ నాయకులు ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే రజనీకాంత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుని బీజేపీలో మాత్రం చేరలేదు. రాజీకాయాల్లోకి వస్తానని అభిమానులను ఊరిస్తూ కొన్ని సంవత్సరాలు కాలం గడిపేసిన రజనీకాంత్ తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు సినిమాల మీద శ్రద్దపెట్టిన రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.












Click it and Unblock the Notifications