ప్రధాని నరేంద్ర మొడీకి శుభాకాంక్షలు చెప్పిన సౌత్ ఇండియా సూపర్ స్టార్: మీరు అనుకుంటే !

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోవడంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వెలుగు చూడటంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీరు సాధించారు అంటూ ట్వీట్లర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

2019 ఏఫ్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మే 23వ తేది (నేడు) లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తున్నారు. దేశంలో మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వేలూరు లోక్ సభ నియోజక వర్గంలో అక్రమాలు జరిగాయని ఎన్నికలు వాయిదా వేశారు.

Super Star Rajinikanth congratulated Narendra Modi on Lok sabha Elections victory.

మొత్తం 542 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 2014లో బీజేపీ 282, ఎన్డీఏ 339, కాంగ్రెస్ 44, యూపీఏ 60 సీట్లలో విజయం సాధించాయి. 542 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్డీఏ 354 పైగా స్థానాల్లో, యూపీఏ 89 స్థానాల్లో, ఇతరులు 100 స్థానాల్లో ముందంజలో ఉన్నారు

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గత సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికలు, తమిళనాడులోని శాసన సభ ఎన్నికలకు రజనీకాంత్ దూరంగా ఉన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+