శశికళ అక్రమాస్తుల కేసు: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి, జయలలిత కేసులో !
అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ సమర్పించిన అర్జీ విచారణ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. నారిమన్ తప్పుకున్నారు.
న్యూఢిల్లీ/బెంగళూరు: అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే. శశికళ నటరాజన్ సమర్పించిన అర్జీ విచారణ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. నారిమన్ తప్పుకున్నారు. తనకు విధించిన శిక్షను పున:పరిశీలించాలని శశికళ సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.
అక్రమాస్తుల కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారని, తీర్పును పున:పరిశీలించాలని శశికళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. నారిమన్ శశికళ అర్జీని విచారణకు స్వీకరించారు.

ఆ సమయంలో శశికళ తరపు న్యాయవాది ముకుల్ రోహగ్ని తమ వాదన వినిపించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. నారిమన్ తండ్రి ఫాలి ఎస్. నారిమన్ గతంలో ఇదే కేసును జయలలిత తరపున వాదించారు. ఇలాంటి సమయంలో ఈ కేసు విచారణ చెయ్యడం భావ్యం కాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్. నారిమన్ విచారణ నుంచి తప్పుకున్నారు.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, ఇలవరసి, సుధాకరన్ కోర్టులో విచారణ ఎదుర్కొన్నారు. కేసు తీర్పు వెలువడకముందే జయలలిత మరణించారు. 2017 ఫిబ్రవరిలో శశికళ, ఇలవరసి, సుధాకరన్ లకు కోర్టు నాలుగు సంవత్సరాల శిక్ష రూ. 30 కోట్ల జరిమాన విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications