సుబ్రతా రాయ్‌ బెయిల్ వ్యవహారం: పూర్తి నివేదిక, కొత్త ప్రణాళిక

న్యూఢిల్లీ: డిపాజిట్‌దార్లను మోసం చేసిన కేసులో జైల్లో ఉన్న సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌‌కి బెయిల్ మంజూరు చేసేందుకు నిధుల కోసం అనుసరిస్తున్న కొత్త ప్రణాళికను తెలియజేయాల్సిందిగా సుప్రీం కోర్టు బుధవారం కోరింది. సుబ్రతా రాయ్‌ని బెయిల్‌పై బయటకు తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు సహారా అధికారులు.

గత వారం అమెరికాకు చెందిన మిరాక్ క్యాపిటల్‌తో ఒప్పందం కుదిరిందని, 2 బిలియన్ డాలర్లను ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని కోర్టుకు తెలిపారు. కోర్టుకు డిపాజిట్ చేయాల్సిన డబ్బు కోసం న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్, లండన్‌లోని గ్రోస్వెనార్ హౌస్‌ లాంటి అతిధి గృహాలను సుబ్రతా రాయ్ అమ్మకానికి ఉంచారు.

Supreme Court asks Sahara to submit fresh fundraising plan for Subrata Roy

వీటిని కొనేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని శారాన్ష్ శర్మ అనే పేరున్న మాజీ బ్రోకర్ సుబ్రతా రాయ్‌ని సంప్రదించాడు. ఆ తరువాత బ్యాంకు ఆఫ్ అమెరికాలోని ఖాతాలో ఆయన బిలియన్ డాలర్లకు పైగా నగదు జమ చేశాడని సహారా కార్పొరేట్ ఫైనాన్సు విభాగం హెడ్ సందీప్ వాద్వా తెలిపారు.

అయితే, తమ బ్యాంక్‌లో అటువంటి ఖాతా ఏమీ లేదని బ్యాంకు అఫ్ అమెరికా అధికారులు స్పష్టం చేయడంతో, ఆయనకు బెయిలు తెప్పించేందుకుఫోర్జరీ పత్రాలను వాడినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయన బెయిలు వ్యవహారంపై మొత్తం నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+