శబరిమల రచ్చ: 'భారత ఆచారాల్లో సుప్రీం జోక్యం తగదు'

న్యూఢిల్లీ: భారత సంప్రదాయాలు, ఆచారాల్లో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం తగదని రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం వ్యాఖ్యానించారు. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించే అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే అంశంపై పైవిధంగా స్పందించారు.

కేరళలోని శబరిమల ఆలయ ఆచారాలను హిందువులు, భారతీయులు గౌరవిస్తారని, 22 ఏళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్న భక్తుడినని, పవిత్ర ఆలయ సంప్రదాయాల్లో కలగజేసుకునేందుకు కోర్టు చేస్తున్న ప్రయత్నాలు అభ్యంతరకరంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జనవరి 11న విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు విచారించింది. రుతుక్రమం వయసులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయంలోకి నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Supreme Court attempt to interfere in traditions of Sabarimlala objectionable: Rajya Sabha MP Rajeev Chandrasekhar

మహిళలకు ఎందుకు ఆలయ ప్రవేశం కల్పించడం లేదనే ప్రశ్నకు స్పందించిన ఎంపీ చంద్రశేఖర్... చాలా సందర్భాల్లో పూర్వకాలంలో సంప్రదాయాలు, ఆచారాలు, నవీన పద్థతులు పరీక్షలను అంగీకరించవని కానీ వాటిని మనం గౌరవించాలని అన్నారు.

అంతేకాదు కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సమర్ధించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశాల్లో లింగ వివక్ష ఉండొద్దన్నారు. 12 భాషల్లో రోజంతా అందుబాటులో ఉండే టూరిస్ట్ హెల్ప్‌లైన్‌ను శర్మ సోమవారం ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+