మీ పని కాపీ పేస్ట్ చేయడమా..- ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్
కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. SIR ప్రక్రియకు సంబంధించి ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయస్థానం ముందుంచిన ప్రతిసారీ ఈసీ ఇలాగే స్పందిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రజలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యలను డిజిటలైజేషన్ వివరాలతో కొట్టిపారేయడానికి ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ఇదే ధోరణిని చూడాల్సి వస్తోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
తమిళనాడుకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపుపై దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఈ నెల 11న ముగియనుంది. దీన్ని పొడిగించాలంటూ పిటీషన్లు దాఖలయ్యాయి.

తమిళనాడులో పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో చాలా మంది వలస కార్మికులని, వారు ఏటా శబరిమల యాత్రకు వెళ్తారని, సంక్రాంతి తర్వాత జనవరి మధ్యలో తిరిగి వస్తారని పిటిషనర్లు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గడువును పొడిగించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా ఈసీ ఇచ్చిన వివరణపై అసహనాన్ని వ్యక్తం చేసింది బెంచ్.
99.27 శాతం మంది ఓటర్ల దరఖాస్తులు స్వీకరించామని, వాటిని డిజిటలైజ్డ్ చేశామని ఈసీ యాంత్రికంగా సమాధానం ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ప్రతిసారి ప్రాక్టికల్ సమస్యను లేవనెత్తినప్పుడు 90- 97 శాతం అన్నదే సమాధానం వస్తుందని గుర్తు చేశారు. తాము వేసే ఏ ప్రశ్నకు అయినా ఈ సమాధానాలన్నీ ఎప్పుడూ ఒకేరకంగా, కాపీ చేసినట్టు ఉంటాయని ఈసీని తీవ్రంగా మందలించింది. రాష్ట్రంలో ఇంకా 56 లక్షల మంది ఓటర్లు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉందంటూ పిటీషన్ లో పొందుపరిచిన విషయాన్ని ఈ సందర్భంగా సీజేఐ గుర్తు చేశారు.
తమ రాష్ట్రంలోని ఓటర్లకు దరఖాస్తులు సమర్పించడానికి మరో రెండు వారాల గడువు పొడిగింపు కావాలని, ఇంకా 20 లక్షల మంది ఓటర్లు తమ ఫారమ్‌లు సమర్పించలేదని కేరళ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది సీకే శశి వెల్లడించారు. మరో సీనియర్ అడ్వొకేట్ పీవీ సురేంద్రనాథ్ పొరుగు రాష్ట్రాల్లో కేరళ విద్యార్థులు చదువుకుంటోన్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం వెలుపల చదువుతున్న విద్యార్థులున్నారని, అలాగే తనలాంటి న్యాయవాదులు చాలామంది ఉన్నారని చెప్పారు.
క్రిస్మస్ సెలవుల కోసం కేరళకు తిరిగి వెళ్లిన తర్వాత దరఖాస్తులను సమర్పించడానికి ఎదురు చూస్తున్నామని సురేంద్రనాథ్ చెప్పారు. 18వ తేదీ వరకు ఉన్న గడువును మరికొంతకాలం పొడిగించాలని అన్నారు. దీనిపై కూడా ఈసీ తమిళనాడుకు మాదిరిగా ఒకే రకమైన సమాధానం ఇచ్చింది. కేరళలో కూడా 97.42 శాతం ఓటర్ల దరఖాస్తులు డిజిటలైజ్డ్ అయ్యాయని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరింత అసహనం వ్యక్తం చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications