ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమన్న ముగ్గురు జడ్జిలు
ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు పేర్కొంది. జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ట్రిపుల్ తలాక్ పద్ధతిని రాజ్యాంగ వ్యతిరేక
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు పేర్కొంది. జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ట్రిపుల్ తలాక్ పద్ధతిని రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
చీఫ్ జస్టిస్ ఖేహర్, జస్టిస్ నాజిర్ మాత్రం ట్రిపుల్ తలాక్ రాజ్యాంగబద్దమన్నారు. అయిదుగురు సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు ఆ పద్ధతిని రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. దీంతో చీఫ్ జస్టిస్ ఈ కేసును 3-2 తేడాతో పక్కన పెట్టేశారు.

ట్రిపుల్ తలాక్ సాంప్రదాయానికి సంబంధించి చట్టాన్ని తయారు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ట్రిపుల్ తలాక్‌పై అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ట్రిపుల్ తలాక్‌పై చీఫ్ జస్టిస్ ఖేహర్ తీర్పును చదివి వినిపించారు.
ఈ అంశంపై రాజకీయాలను పక్కనబెట్టి, అన్ని పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇప్పటి నుంచి ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్ పద్దతి అమలులో ఉండదని కోర్టు చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications