వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ కుమార్‌పై ఆధారాలతో రండి... సీబీఐ పిటిషన్‌ విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

శారదా చిట్‌ఫండ్ కేసులో పోలీస్ కమిషనర్ సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ. కేసును వెంటనే విచారణకు స్వీకరించాల్సిందిగా సీబీఐ తరపున కేసును వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ పై ఎలాంటి సాక్షాధారాలు కోర్టులో సమర్పంచకపోవడంతో కేసును ఇప్పటికిప్పుడు విచారణ చేయలేమని చెబుతూ మంగళవారానికి కేసును వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

శారదా చిట్‌ఫండ్ స్కాముకు సంబంధించి విచారణకు సహకరించకపోగా... బెంగాల్ పోలీసులే ఓ రాజకీయపార్టీతో పాటు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది. పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ కుంభకోణంకు సంబంధిచిన ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని సీబీఐ తరపున న్యాయవాది తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇది కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని కేసును విచారణకు స్వీకరించిన ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

Supreme Court to hear CBI plea against Kolkata Police Chief tomorrow,CJI SaysNo Evidence Right Now

ఇదిలా ఉంటే రెండు పిటిషన్లను సోమవారం కాకుండా మంగళవారం విచారణ చేస్తామని ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఆదివారం సీబీఐ అధికారులను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేసిన నేపథ్యంలో ఇంత అర్జెంటుగా కేసు విచారణ చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది న్యాయస్థానం. అంతేకాదు తగిన సాక్ష్యాధారాలు కూడా లేకపోవడంతో కేసును ఎలా విచారణ చేస్తామని న్యాయమూర్తులు సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు. ఒకవేళ పోలీసులు కానీ రాజీవ్ కుమార్ కానీ ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని చెప్పేందుకు ఏమైనా రుజువులుంటే న్యాయస్థానం ముందు ఉంచాలని చెప్పారు. ఈ ఆధారాలన్నీ అఫిడవిట్ రూపంలో కోర్టుముందు ఉంచాలని ఆదేశించింది.

హైడ్రామా: కోల్‌కతా సీపీ ఇంటికి సీబీఐ, అడ్డుకున్న పోలీస్, కాపాడేందుకు రంగంలోకి దిగిన మమతా బెనర్జీహైడ్రామా: కోల్‌కతా సీపీ ఇంటికి సీబీఐ, అడ్డుకున్న పోలీస్, కాపాడేందుకు రంగంలోకి దిగిన మమతా బెనర్జీ

ఒకవేళ నిజంగానే ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారనేందుకు రుజువులు ఉంటే చూపించండి... రాజీవ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది. సోమవారం ఉదయమే దాఖలైన పిటిషన్‌ను తాము చదివినట్లు వెల్లడించిన ధర్మాసనంలోని న్యాయమూర్తులు... ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కేసును ఇప్పుడు విచారణ చేయలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం.

English summary
The Supreme Court will on Tuesday hear applications moved by the CBI alleging destruction of electronic evidence related to the Saradha chit fund scam case by the Kolkata Police commissioner.The CBI alleged that it has moved the application as an extraordinary situation has arisen in which the top police officials of the West Bengal Police are sitting on a dharna along with a political party in Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X