జూలై 10లోపు రావాలి: విజయ్ మాల్యాపై సుప్రీం కోర్టు ఆగ్రహం
బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి వెళ్లిన విజయ్ మాల్యా పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలాది కోట్లు ఎగనామం పెట్టి వెళ్లిన విజయ్ మాల్యా పైన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కార అభియోగాలను విచారించేందుకు వీలుగా జులై 10వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని విజయ్ మాల్యాను సుప్రీం కోర్టు ఆదేశించింది. మాల్యాపై కోర్టు ధిక్కార నేరాలను మోపాలని బ్యాంకుల కన్సార్టియం పెట్టుకున్న పిటిషన్‌ను ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది.

విజయ్ మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర ఎగనామం పెట్టి వెళ్లిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నారు. దీంతో ఆయనపై రుణ ఎగవేత కేసులు, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఆయన్ను న్యాయస్థానం ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది.












Click it and Unblock the Notifications