వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ నిషేధం: శారిడాన్‌కు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఔషధాల(డ్రగ్స్‌) నిషేధ జాబితా నుంచి శారిడాన్‌కు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించిన 328 డ్రగ్స్‌ జాబితా నుంచి శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌ మూడు బ్రాండ్లను మినహాయిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.

శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌లను మార్కెట్‌లో విక్రయించుకునేలా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యానికి హాని కరంగా ఉన్నాయంటూ దాదాపు 328 డ్రగ్స్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

328 కాంబినేషన్ మెడిసిన్స్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం...అవి ఏమిటో తెలుసా..?328 కాంబినేషన్ మెడిసిన్స్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం...అవి ఏమిటో తెలుసా..?

Supreme Court lifts ban on sale of Saridon and 2 other drugs for now

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, పిరామల్‌ వంటి డ్రగ్స్‌ మేకర్స్‌కు భారీ ఊరట లభించినట్లయింది. ఈ ప్రొడక్ట్‌లు, ఆయా కంపెనీలకు పాపులర్‌ బ్రాండ్లు. 328 మెడిషిన్లపై నిషేధం విధిస్తూ.. కేంద్రం జారీచేసిన నోటీసులపై ఈ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

జాబితా నుంచి తమ కాంబినేషన్స్‌ను మినహాయించాలని కంపెనీలు కోరాయి. 1988 నుంచి ఈ కాంబినేషన్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీలు చెప్పాయి. అంతకముందు కూడా సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిషేధం నుంచి ఇలాంటి 15 కాంబినేషన్లను మినహాయించినట్టు తెలిపాయి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గ్లాక్సోస్మిత్‌క్లైన్ ధృవీకరించింది.

English summary
Giving a major relief to people suffering from a headache, the Supreme Court on Monday lifted the ban of Saridon imposed by the government. The Supreme Court has allowed the sale of Saridon and two other drugs for now on a petition filed by drug makers, TV news channels reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X