మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ : మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సందర్భంగా సమర్పించిన నామినేషన్ పత్రాల్లో క్రిమినల్ కేసులు పేర్కొనలేదనే పిటిషన్ పై నోటీసులు జారీచేసింది. ఫడ్నవీస్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై స్పందించాల్సిందిగా కోరుతూ ఫడ్నవీస్ కు నోటీసులు జారీచేసింది.
ఫడ్నవీస్ పై ఆరోపణలు చేస్తూ సతీశ్ అనే వ్యక్తి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ ను కొట్టేసింది న్యాయస్థానం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సతీశ్. దీనిపై గురువారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఫడ్నవీస్ కు నోటీసులు జారీ చేసింది.













Click it and Unblock the Notifications