Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీధి కుక్కలకు ఎక్కడపడితే అక్కడ ఫుడ్ పెట్టారో.. సుప్రీం తాజా సవరణలు

వీధి కుక్కల తరలింపు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక సవరణలు చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అందులో మార్పులు చేసింది. వీధి కుక్కలన్నింటినీ కూడా షెల్టర్లకు తరలించాలంటూ ఇచ్చిన ఆదేశాల్లో ఈ సవరణలను ప్రతిపాదించింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్ వీ అంజరియాతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని వీధి కుక్కలన్నింటినీ కూడా ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Supreme Court orders that no public feeding of dogs will be allowed

తాజాగా ఈ ఉత్తర్వులను మోడిఫై చేసింది. పలు మార్పులకు ఆదేశించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం- వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేసిన తర్వాతే షెల్టర్ల నుంచి విడిచిపెట్టాల్సి ఉంటుంది. డీవార్మింగ్, వ్యాక్సినేట్ చేయాలి. అనంతరం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో.. అదే ప్రాంతంలో వాటిని సంబంధిత సిబ్బంది విడిచిపెట్టాలి. ఆ సమయంలో వాటి ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

అగ్రెసివ్ గా బిహేవ్ చేసే వీధి కుక్కలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలి. జనావాసాలు లేదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో.. అదే ప్రాంతానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ తరలించకూడదు. అగ్రెసివ్ గా బిహేవ్ చేసే వీధి కుక్కల వల్ల పిల్లలు, వయోధిక వృద్ధులకు ప్రమాదం పొంచివుండొచ్చు.

షెల్టర్లల్లో ఉండే వీధి కుక్కులకు ఎవరే గానీ బయటి వ్యక్తులు, ఎటువంటి ఆహారాన్ని కూడా అందించకూడదు. అలాగే వీధుల్లో ఉండే కుక్కలకు కూడా బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ కూడా ఆహారం పెట్టకూడదు. వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయాలి. ఇలా ప్రత్యేక స్థలాల్లో వాటికి ఆహారం పెట్టిన సందర్భాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

వార్డుల్లో ప్రత్యేకంగా వీధి కుక్కులకు ఆహారాన్ని అందించడానికి అవసరమైన ప్రదేశాలను ఏర్పాటు చేసే బాధ్యతను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పగించింది సుప్రీంకోర్టు. జంతు ప్రేమికులు కుక్కలను దత్తత తీసుకోవడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

తాజా ఉత్తర్వులను సుప్రీంకోర్టు అడ్వొకేట్, పిటిషనర్ ననితా శర్మ స్వాగతించారు. ఇది బ్యాలెన్స్డ్ గా ఉందని అన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను చేర్చిందని వివరించారు. ఆయా రాష్ట్రాల్లో గల అన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వీధి కుక్కల సమస్యకు సంబంధించిన అన్ని విషయాలను ఒకే పరిధిలోకి తీసుకువస్తారని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+