Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోటాలోనే విద్యార్ధుల ఆత్మహత్యలెందుకు ? రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్..!

దేశంలో జాతీయ పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్ కోచింగ్ కోసం విద్యార్ధులు భారీగా రాజస్థాన్ లోని కోటాకు వెళ్తుంటారు. వీరికి ఆయా పరీక్షల్లో ర్యాంకులు వస్తున్నాయా లేదా అనే సంగతి కాసేపు పక్కనబెడితే.. కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఇప్పటికే పలు కోర్టులు విచారణ జరిపి కీలక తీర్పులు కూడా ఇచ్చాయి. ప్రభుత్వాలు కూడా సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చాయి. అయినా పరిస్దితిలో మార్పు రాకపోవడంపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజస్థాన్ లో పెరిగిపోతున్న విద్యార్ధుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి అక్కడి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయింది. కోటాలోనే ఇంతమంది విద్యార్ధులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాజస్థాన్ సర్కార్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ఘటనల్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది కోటాలో ఇప్పటివరకూ 14 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

supreme court raps rajasthan government over kota students suicides ask why only here

కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యలపై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, ఆర్ మహదేవన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదో తీవ్రమైన అంశమని అభిప్రాయపడింది. ఇప్పటివరకూ కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నియమించిన సిట్ తీసుకున్న చర్యల్ని తమకు అందజేయాలని ఆదేశించింది. ఇంత జరుగుతుంటే ఓ రాష్ట్ర ప్రభుత్వంగా మీరేం చేస్తున్నారని రాజస్థాన్ సర్కార్ ను ప్రశ్నించింది. తాజాగా ఇద్దరు విద్యార్ధులు చనిపోయిన వ్యవహారంపై ఓ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడాన్ని సైతం సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇది తమ తీర్పు ఉల్లంఘనగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

రాజస్థాన్ లోని కోటాలో పోటీ పరీక్షల కోచింగ్ కు వెళ్తున్న విద్యార్ధుల ఆత్మహత్యల సంఖ్య ఏటికేడాది పెరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు, కోర్టులు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఇప్పటివరకూ కోటాలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్ధులు ఎంత మంది అని ప్రశ్నించింది. ఆ వివరాలు తమకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+