షెడ్యూల్ ప్రకారమే నీట్ 2021 పరీక్ష - తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు- వాయిదాకు ససేమిరా
దేశవ్యాప్తంగా మెడికల్ యూజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష 2021 ని వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న జరగాల్సిన నీట్ పరీక్షను వివిధ కారణాలతో పాయిదా వేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది.
సీబీఎస్ఈ కంపార్ట్ మెంట్, ప్రైవేట్, పత్రచార్ పరీక్షల షెడ్యూల్ తో క్లాష్ అవుతుందన్న కారణంతో నీట్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు విద్యార్దులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... 16 లక్షల మందికి పైగా విద్యార్ధులు రాస్తున్న నీట్ పరీక్షను కొందరి పిటిషన్ల ఆధారంగా వాయిదా వేయబోమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో ఎలాంటి సందిగ్ధతకు తావివ్వబోమని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

వాస్తవానికి సెప్టెంబర్ 12న జరిగే నీట్ పరీక్షకు సీబీఎస్ఈ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని, నీట్ రాశాక జరిగే కౌన్సిలింగ్ కు మాత్రమే ఈ ఫలితాలతో సంబంధం ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సుప్రీంకోర్టుకు ఈ నెల 3న తెలిపింది. దీంతో సీబీఎస్ఈ ఫలితాలు రాకముందే నీట్ పరీక్ష నిర్వహించకూడదన్న డిమాండ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మిగతా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు నీట్ పరీక్ష కు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు ఉన్నట్లు పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన వివరణను గుర్తు చేసిన సుప్రీంకోర్టు.. షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 12న నీట్ పరీక్ష నిర్వహణకు ఆదేశాలు ఇచ్చింది.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications