ఛత్తీస్‌గఢ్ సీఎంకు, ఆయన కుమారునికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్!
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆయన కుమారుడు అభిషేక్ సింగ్‌లకు మంగళవారం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పదేళ్ల క్రితం జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో ముడుపులు అందాయనే ఆరోపణల నుంచి వారు విముక్తులయ్యారు.
ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని స్వరాజ్ అభియాన్ అనే ఎన్‌జీవో, ఇతరులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే పిటిషనర్లు చేసిన ఆరోపణలను జస్టిస్ ఆదర్శ్ కే గోయల్, జస్టిస్ ఉదయ్ యూ లలిత్ ధర్మాసం తోసిపుచ్చింది.

2006 నుంచి 2008 మధ్య కాలంలో హెలికాప్టర్లను కొనేందుకు అవసరమైనదాని కన్నా ఎక్కువ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని, ఇది అక్రమమని పిటిషనర్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్‌కు చెందిన బ్యాంకు ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయిందని, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్ (యూకే)లోని బ్యాంకులో ఈ ఖాతాలు ఉన్నాయని కూడా వారు పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాధారాలు లేవని తీర్పు చెప్పింది. అంతేకాదు, హెలికాప్టర్‌ను ఎంపిక చేసుకుని కొనే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.
హెలికాప్టర్లను తక్కువ ధరకే కొని ఉండవచ్చనేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించరాదని స్పష్టం చేసింది. అంతకన్నా మెరుగైన బేరంతో ఎవరూ రాలేదని, షార్ప్ ఓషన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌కు కమీషన్ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని తెలిపే స్పష్టమైన సాక్ష్యాధారమేదీ లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
అందువల్ల ఈ కేసులో కోర్టు జోక్యం చేసుకోవడం సమర్ధనీయం కాదని, ఈ లావాదేవీలో ముఖ్యమంత్రి కుమారుడు అభిషేక్ సింగ్ లాభపడినట్లుగా చెప్పడానికి ప్రాథమికంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, కాబట్టి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని జస్టిస్ ఆదర్శ్ కే గోయల్, జస్టిస్ ఉదయ్ యూ లలిత్ ధర్మాసం పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications