కావేరీ నీటిపై సుప్రీం కోర్టు తీర్పు మీద రజనీకాంత్ స్పందన
చెన్నై: కావేరీ నదీ జలాల కేటాయింపులో తమిళనాడు వాటాను తగ్గిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంపై సూపర్ స్టార్ తమిళనాడు స్పందించారు. ఈ తీర్పు తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.

కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని, దీని ప్రభావం రైతుల జీవనోపాధిపై దెబ్బకొడుతోందని, దీనిపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని రజనీకాంత్ అన్నారు.
అంతకముందు కమల్‌హాసన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు విని నేను షాకయ్యానని చెప్పారు.












Click it and Unblock the Notifications