వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత పథకాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు-తీవ్ర సమస్యే-అభివృద్ధితో సమం చేయాల్సిందే..

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై
సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా స్పందించింది. ఇవాళ మరోసారి దీనిపై విచారణ నిర్వహించిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా ఉన్నాయి. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.

ఉచితాలపై సుప్రీం విచారణ

ఉచితాలపై సుప్రీం విచారణ


దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, వాటి కోసం అనంతరం పెడుతున్న ఖర్చు, దాంతో దేశ ప్రగతిపై పడుతున్న ప్రభావం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ నిర్వహించింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలను నిషేధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఎన్నికల మేనిఫెస్టోను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, అందులో చేసిన వాగ్దానాలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఉచితాలపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ ఆసక్తికర వాదనలు కూడా చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాల ప్రకటనపై సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉచితాలు తీవ్ర సమస్య అన్న సుప్రీంకోర్టు

ఉచితాలు తీవ్ర సమస్య అన్న సుప్రీంకోర్టు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం, అనంతరం ఉచిత పథకాలు పంపిణీ చేయడం "తీవ్రమైన సమస్య" అని సుప్రీంకోర్టు ఇవాళ పేర్కొంది. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతోందని తెలిపింది.
ఇది సమస్య కాదని ఎవరూ అనరని, ఇది తీవ్రమైన సమస్యని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాలు పొందుతున్న వారికి అది కావాలి, మాది సంక్షేమ రాజ్యం, తాము పన్నులు చెల్లిస్తున్నామని, అభివృద్ధి ప్రక్రియకు వినియోగించాలని కొందరు అనవచ్చని.. కాబట్టి ఇది తీవ్రమైన సమస్యని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి ఇరు పక్షాల వాదనలను తాము నియమించిన కమిటీ వినాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పారు.

ఉచితాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఉచితాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

భారతదేశం పేదరికం ఉన్న దేశమని, ఆకలితో అలమటించే వారి విషయంలో కేంద్రానికీ ప్రణాళికలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఆర్థిక వ్యవస్థ దీని వల్ల డబ్బును కోల్పోతోందని, దీంతో ప్రజల సంక్షేమం సమతుల్యంగా ఉండాలని సీజేఐ రమణ అన్నారు. అంతకుముందు ఉచితాలపై దాఖలైన పిటిషన్లు కొట్టేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. అర్హత ఉన్న, వెనుకబడిన ప్రజల సామాజిక ఆర్థిక సంక్షేమం కోసం చేపట్టే పథకాలను 'ఉచితాలు'గా వర్ణించలేమమని పేర్కొంది.

English summary
supreme court on today made serious comments on freebies distribution during elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X