పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై పిటిషన్, కేంద్రం స్పందన కోరిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు కేంద్రం కల్పించిన పది శాతం రిజర్వేషన్ బిల్లు పైన స్టే విధించాలని సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ప్రముఖ ఉద్యమకారులు తెహసీన్ పూనావాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సుప్రీం కోర్టు ధర్మాసనం స్వీకరించింది. అయితే రిజర్వేషన్లను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేజన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలవుతోన్న విషయం తెలిసిందే. ఆర్థిక స్థాయి ఒక్కటే వెనకబాటు తనంగా భావించి రిజర్వేషన్లు కల్పించడం సరికాదని తాజా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రం స్పందనను కోరింది.

అదే సమయంలో ఈ రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి స్టే విధించమని చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుపై జన్‌హిత్ అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్లపై గతంలోనే సుప్రీం కోర్టు.. కేంద్రం స్పందన కోరింది.
తాజాగా వ్యాపారవేత్త పూనావాలా దాఖలు చేసిన పిటిషన్‌ను వాటితో పాటు జత చేసింది. ఆర్థికంగా బలహీన వర్గాల సాధికారత కోసం తీసుకువచ్చిన ఈ రిజర్వేషన్ బిల్లును కొట్టివేయాలని, ఆర్థిక వెనబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, యాభై శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ఉల్లఘించకుండా చూడాలని యూత్ ఫర్ ఈక్వాలిటీ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications