ఏంటీ అరాచకం...? సుప్రీంకోర్టే షాకైన వేళ.. !
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఓ కీలక అంశంలో షాకైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఓ లాయర్, ఓ ప్రొఫెసర్ తో పాటు మరో ముగ్గురి ఇళ్లను ప్రభుత్వం నోటీసులిచ్చి తగిన గడువు ఇవ్వకుండానే కూల్చివేసింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన తమను షాక్ కు గురిచేసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం, అమానవీయం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది తమ మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోందని తెలిపింది.

ఆశ్రయం పొందే హక్కు, చట్టబద్ధమైన ప్రక్రియను ఇది స్పష్టంగా ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించిన ఇంటి యజమానులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2023లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందినదిగా భూమిగా భావించి అధికారులు తమ క్లయింట్ల నివాసాలను కూల్చేశారని పిటిషనర్ల లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో కూల్చివేత నోటీసులు ఇచ్చిన తీరుపై కూడా అధికారులను కోర్టు మందలించింది. ఆస్తులపై నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపారని కోర్టు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications