మనిషికి విశ్వసనీయ నేస్తం కుక్క, చంపే హక్కు ఎక్కడిది: సుప్రీం
న్యూఢిల్లీ: మనిషికి విశ్వసనీయ నేస్తాలైన వీధి కుక్కలను చంపే అధికారం మున్సిపల్ అధికారులకు ఎవరు ఇచ్చారని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం నాడు ప్రశ్నించింది. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయనే పేరుతో ముంబై మున్సిపల్ అధికారులు వీధికుక్కలను పట్టుకుని చంపడంపై దాఖలైన ఒక పిటిషన్‌ను సుప్రీం విచారించింది.
విశ్వసనీయమైన కుక్క విశ్వసనీయమైన నేస్తమని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పి.సి.పంత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. మనిషికి మంచి మిత్రులు కూడా కుక్కలేనని పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.

ఇంటికే రైలు టికె ట్.. అప్పుడే డబ్బులు!
ఇప్పుడు రైలు టికెట్లు ఇంటి నుంచి కదలకుండానే పొందొచ్చు.. టికెట్ వచ్చాకే డబ్బులు చెల్లించవచ్చునంట. టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే సౌలభ్యం ఇంతకుముందే ఉన్నప్పటికీ వాటికి సీవోడీ ఆప్షన్నిస్తూ డోర్ డెలివరీ చేసే వ్యవస్థకు ఐఆర్‌సీటీసీ శ్రీకారం చుట్టింది.
క్రెడిట్, డెబిట్ కార్డులను విరివిగా వాడే వినియోగదారులు, నెట్‌బ్యాంకింగ్ సౌకర్యం లేని వారిని లక్ష్యంగా చేసుకుని ఐఆర్‌సీటీసీ ఈ కొత్త పథకానికి ఓంకారం పలికింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా 200 నగరాలకు మాత్రమే దీనిని పరిమితం చేశారు. ప్రయాణానికి ఐదు రోజుల ముందు టికెట్‌ను బుక్‌చేసుకోవాలి. స్లీపర్‌క్లాస్ టికెట్‌కైతే రూ.40, ఏసీ క్లాస్ అయితే రూ.60 డెలివరీ చార్జీలుగా వసూలు చేస్తుంది.












Click it and Unblock the Notifications