టపాసుల బదులు స్వీట్లు కొనుక్కోండి-స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం-సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా వెలువడుతున్న గాలి కాలుష్యంపై ప్రతీ ఏటా కోర్టులు, ప్రభుత్వాలు పలు సూచనలు చేస్తూనే ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. అయినా జనంలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న బాణాసంచా నిషేధం చర్చనీయాంశమైంది. దీనిపై కొందరు సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా నిషేధం ఎత్తివేతకు అంగీకరించలేదు.

ఢిల్లీలో బాణసంచా నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరుతూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వాలని, మీ డబ్బును స్వీట్లకు ఖర్చు చేయండి అంటూ పిటిషనర్ కు సుప్రీం కోర్టు చురకలు అంటించింది. అంతకుముందు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అన్ని రకాల టపాసుల అమ్మకాలు, వినియోగంపై పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది.

supreme court suggest purchasing sweets than crackers-uphold crackers ban in delhi

పండుగ సీజన్‌లో కేవలం గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కొనడం, అమ్మడం, నిల్వ చేయడం వంటివి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఇద్దరు వ్యాపారులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ తోసిపుచ్చారు.

దీనిపై హైకోర్టు సైతం పిటిషన్లను విచారణకు స్వీకరించవద్దని సుప్రీంకోర్టు సూచించింది. ప్రతీ ఏటా ఢిల్లీలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. దీపావళి సీజన్ లో మరింతగా ఇది పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, నిషేధాజ్ఞలు విధిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం ఈసారి బాణాసంచా కోనుగోళ్లు, అమ్మకాల సహా వాడకంపైనా పూర్తిగా నిషేధం విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+