పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్..
యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై మోసపూరిత ప్రకటనలు చేస్తే ఒక్కొక్క ఉత్పత్తిపై భారీ జరిమానా తప్పదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో ఉత్పత్తులపై చేసే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. పతంజలి కంపెనీ చేస్తున్న నిరాధారమైన, మోసపూరితమైన ప్రకటనలను ఆపివేయాలని, లేకపోతే ఆ సంస్థ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని తీవ్రంగా హెచ్చరించింది.
పతంజలి సంస్థపై కేసువేసిన ఐఎంఏ : తమ ఉత్పత్తుల వల్ల కొన్ని వ్యాధులు నయం అవుతాయంటూ పతంజలి కంపెనీ కొన్ని ప్రకటనలు చేస్తోంది. దీన్ని తప్పుపడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ పిటీషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఐఎంఎ వేసిన పిటీషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి.

అందులో భాగంగా నవంబర్ 21,2023 న జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం పతంజలి ఆయుర్వేద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ విధానాన్ని అనుసరించే డాక్టర్లను కించపరిచేలా..నిరాధార ఆరోపణలు చేస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులను, ఆ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
పతంజలి ఆయుర్వేద సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పతంజలి సంస్థ డాక్టర్లపై కించపరిచేలా వ్యవహరించటం సరికాదని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఇలాంటి ప్రకటనలు చేయవద్దని పతంజలి సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను 2024 ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇదే కేసులో గతంలో కూడా రామ్‌దేవ్‌బాబాను సుప్రీంకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications