వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టులో చిదంబరానికి ఎదురుదెబ్బ.. అత్యవసరంగా పిటిషన్ విచారించలేమని వెల్లడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన యత్నాలు ఫలించలేదు. బెయిల్ ఇచ్చేందుకు నిన్న ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో .. దర్యాప్తు సంస్థలు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. వెంటనే ఆయన ఇంటికి వెళ్లగా .. లేకపోవడంతో నోటీసులు అందజేశారు. ఇక అప్పటినుంచి చిదంబరం కోసం ఏజెన్సీలు .. బెయిల్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరిన .. సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు.

<strong>చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. రెండురోజుల తర్వాత బెయిల్ పిటిషన్ విచారిస్తామని స్పష్టీకరణ </strong>చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. రెండురోజుల తర్వాత బెయిల్ పిటిషన్ విచారిస్తామని స్పష్టీకరణ

చిదంబరం బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి చకచకా పరిణామాలు జరిగిపోతున్నాయి. తొలుత జస్టిస్ ఎన్వీ రమణ విచారణ చేపట్టి .. సీజేఐ రంజన్ గొగొయ్‌కు అప్పగించారు. ఆయన విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. దీంతో ఉత్కంఠగా మారింది. చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్ అండ్ కో సుప్రీంకోర్టులోనే ఉండి .. పిటిషన్ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఇవాళ అయోధ్య కేసు విచారణ ఉండటంతో సీజేఐ రంజన్ గొగొయ్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టబోమని సంకేతాలిచ్చారు. అయితే కపిల్ సిబల్ బృందం మాత్రం తమ పిటిషన్ విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్టార్‌ను కోరారు. వారి వినతిని పరిశీలనలోకి తీసుకున్న రిజిస్టార్ .. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు సీజేఐకి తెలిపి .. తేదీ తీసుకున్నారు. చిదంబరం పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని రిజిస్టార్ కపిల్ సిబల్ బ‌ృందానికి తెలిపారు.

Supreme Court will take up P Chidambarams bail plea Friday

ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని వెంటాడుతుంది. ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టిన విదేశీ పెట్టుబడులు రూ.305 కోట్లు అక్రమమని దర్యాప్తు సంస్థలు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జీ అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరంను విచారించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు లుక్ ఔట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

English summary
Supreme Court will take up P Chidambaram's bail plea on Friday. refusing to pass an order, the Supreme Court has said Congress leader P Chidambaram's plea challenging the Delhi High Court order dismissing his petition for pre-arrest bail in the INX media case will be put before the CJI to consider for urgent listing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X