Suresh Rathore: లేటు వయసులో ఘాటు ప్రేమ.. నటిని పెళ్లాడి చిక్కుల్లో పడిన మాజీ ఎమ్మెల్యే

Suresh Rathore: లేటు వయసులో ఘాటు ప్రేమ ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేను చిక్కుల్లో పడేసింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ ఓ నటిని పెళ్లి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌కు ఇప్పటికే వివాహం కాగా.. ఆమెతో విడాకులు తీసుకోకుండానే ఊర్మిళా సనావర్ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఊర్మిళా సనావర్‌తో కలిసి సురేష్ రాథోడ్ సోషల్ మీడియాలో రీల్స్ చేయడంతో ఆయనపై పార్టీ సీరియస్ అయింది. ఆ రీల్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై మండిపడితున్నారు. వారిద్దరు ఇష్టారీతిన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఊర్మిళా సనావర్‌కు సురేష్ రాథోడ్ మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో, బీజేపీ పార్టీకి చెందిన నేత కావడంతో ఆ పార్టీపైనా విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో పార్టీ సురేష్ రాథోడ్ తీరుపై సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సురేష్ రాథోడ్‌కు బీజేపీ పార్టీ నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యంపై 7 రోజుల్లో స్పందించాలని ఆయనను ఆదేశించింది. ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలులో ఉండడంతో బహుభార్యత్వం చెల్లదు. కానీ 2021లోనే ఊర్మిళా సనావర్‌ను నేపాల్‌లో వివాహం చేసుకున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ చెబుతున్నారు. ఆ సమయానికి యూనిఫాం సివిల్ కోడ్ అమలులో లేదని అంటున్నారు. అయినప్పటికీ సురేష్ రాథోడ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Suresh Rathore in Controversy Late-Age Love and Marriage to Actress Sparks BJP Action

ఎవరు ఈ సురేష్ రాథోడ్?
సురేష్ రాథోడ్ 2017 నుంచి 2022 వరకు హరిద్వార్‌లోని జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2022 ఎన్నికల్లో సురేష రాథోడ్ ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత నటి ఊర్మిళ సనావర్ అనే నటితో సహజీవనం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మీడియా ముందు ప్రపోజ్ చేసుకోవడంతో సురేష్ రాథోడ్ చిక్కుల్లో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+