How's the Josh: అజిత్ దోవల్ కనుసన్నుల్లో.. ఇలా 10రోజుల పక్కా ప్లాన్‌తో పాక్‌పై దాడి
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా దాడిలో నలభై మందికి పైగా జవాన్లను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థికంగా, ప్రపంచంలో పాకిస్తాన్‌ను ఏకాకి చేసేందుకు భారత్ అన్ని విధాలుగా పావులు కదుపుతూ వచ్చింది. దిగుమతులపై 200 శాతం సుంకం విధించింది. పాక్‌కు నీటిని ఆపేసింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది. అంతర్జాతీయస్థాయిలో ఏకాకిని చేసే ప్రయత్నాలు చేసింది.

పదకొండు రోజుల తర్వాత పక్కా ప్లాన్‌తో
ఫిబ్రవరి 14న దాడి జరగగా... భారత్ పక్కా ప్లాన్‌తో పదకొండు రోజుల తర్వాత ప్రతీకార దాడి చేసింది. ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం వేకువజామున హఠాత్తుగా దాడికి పాల్పడి 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ దాడి గురించి అజిత్ దోవల్ పది రోజుల క్రితమే అమెరికాకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల గురించి అమెరికా జాతీయ భద్రతాధికారి జాన్ బోల్టన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ముందుగానే చర్చించారట. ఫిబ్రవరి 16వ తేదీన ఫోన్ చేసిన సమయంలో దాడులపై ఇరు దేశాధికారులు చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. మోడీకి సమాచారం ఇచ్చి, దోవల్ కనుసన్నుల్లో జరిగింది.

15వ తేదీన ప్రణాళిక ఇచ్చిన ఐఏఎఫ్
పుల్వామా దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల ప్రణాళికను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ఎయిర్ చీఫ్ మార్షల్ బిరేంద్ర సింగ్ ఈ ప్రణాళికను అందించారు. దీనికి ప్రభుత్వం వెంటనే పచ్చజెండా ఊపింది.

ఐదు రోజుల పాటు నిఘా
ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సరిహద్దుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిఘాను పెట్టాయి. వివిధ మార్గాల్లో ప్రత్యర్థి శిబిరాల సమాచారాన్ని సేకరించాయి. డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టాయి.

దాడులు చేయాల్సిన ప్రదేశాల గుర్తింపు
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ దాడులు చేయాలో.. ఆ ప్రదేశాలను గుర్తించాయి. ఇందుకు సంబంధించి మ్యాప్‌లను సిద్ధం చేసుకున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో లక్ష్యాలను నిర్దేశించారు. ఫిబ్రవరి 22వ తేదీన భారత వాయుసేనలో ఒక టైగర్ స్క్వాడ్రన్, 7 బాటిల్ యాక్సెస్ స్క్వాడ్రన్‌లను పూర్తిగా సిద్ధం చేశారు. అదే రోజు రెండు స్క్వాడ్రన్ల నుంచి 12 మిరాజ్ 200లను ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు.

24న ప్రయోగం.. 25న ప్రధానికి సమాచారం
ఫిబ్రవరి 24వ తేదీన సెంట్రల్ ఇండియాలో గగనతలంపై ఆపరేషన్ ప్లాన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆ తర్వాత 25వ తేదీన ఆపరేషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పన్నెండు మిరాగ్ 2000లను గ్వాలియర్ నుంచి రప్పించారు. అందులో లేజర్ గైడ్ బాంబులు ఉంచారు. దాడికి ముందు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీకి సమాచారం అందించారు.

దాడి ఎప్పుడు ఎక్కడ జరిగిందంటే?
26వ తేదీన మొదటి దాడి మంగళవారం వేకువజామున గం.3.45 ని.లకు ప్రారంభమైంది. పీఓకే రాజధాని అయిన ముజఫరాబాద్‌కు 24 కి.మీ దూరంలో బాలాకోట్ ప్రాంతంపై 3.45 నుంచి 3.53 వరకు బాంబుల వర్షం కురిసింది. బాలకోట్ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ప్రాంతం. మరో లక్ష్యమైన ముజఫరాబాద్ ప్రాంతంపై యుద్ద విమానాలు గం.3.48 ని.ల నుంచి గం.3.55 ని.ల మధ్య దాడులు చేశారు. చకోటి ప్రాంతంపై గం.3.58 ని.ల నుంచి గం.4.04 నిమిషాల వరకు జెట్ ఫైటర్స్ బాంబుల వర్షం కురిపించాయి. ఆ తర్వాత విషయాన్ని అజిత్ దోవల్.. ప్రధాని మోడీకి తెలిపారు.












Click it and Unblock the Notifications