అవసరమైతే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్: పాక్‌కు రావత్ హెచ్చరిక
దాయాది పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం హెచ్చరిక జారీ చేశారు.
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం హెచ్చరిక జారీ చేశారు. సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు.
అలాగే.. పాకిస్థాన్ శాంతి కోరుకోకుంటే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు తాము సిద్ధమని తేల్చి చెప్పారు. అవసరమైతే మరిన్నిసార్లు దాడులు జరుపుతామని తెలిపారు. ఇక సైనికుల ఆహార కష్టాలపై స్పందించిన ఆయన.. సైనికుల భోజనం సరిగా లేదన్న వార్తలను తోసిపుచ్చారు.

సమస్యలుంటే జవాన్లు సోషల్ మీడియాను ఆశ్రయించకుండా.. తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్యలు చెప్పే జవాన్ల పేర్లను రహస్యంగా ఉంచుతామని చెప్పారు. ఇకపై సైనికుల హెడ్ క్వార్టర్స్ వద్ద ఫిర్యాదుల బాక్స్ పెడతామని తెలిపారు.












Click it and Unblock the Notifications