Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుజరాత్ టూర్‌తో తగ్గిన కేజ్రివాల్ పాపులారిటీ (పిక్చర్స్)

బెంగళూరు: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన నాలుగు రోజుల రోడ్ షో (మార్చి 8) శనివారం ముగిసింది. అయితే ఈ పర్యటన విజయవంతమైందని ఆయన మద్దతుదారులు అంటుండగా.. చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాత్రం అదొక ఫ్లాప్ షోగా అభివర్ణించారు.

గుజరాత్ రాష్ట్రంలో అరవింద్ కేజ్రివాల్ పర్యటించిన తర్వాత తమ పార్టీ, కేజ్రివాల్ మరింత పాపులర్ అయ్యారని ఆ పార్టీ మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పర్యటనలో ఘర్షణలు, అరెస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే సోషల్ సైట్స్ ముఖ్యంగా ట్విట్టర్ బేస్ చేసుకుని చేసిన ఒక పరిశోధనలో ఆప్ మద్దతుదారులు చెప్పిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి.

గుజరాత్ రాష్ట్రంలో కేజ్రివాల్, ఆప్ పార్టీపై 84శాతం మంది ప్రజలు వ్యతిరేకత పెంచుకోగా.. ఆయనకు మద్దతిచ్చే వారి శాతం 17కు పడిపోయిందని కేజ్రివాల్ గుజరాత్‌లో పర్యటించిన తర్వాత నిర్వహించిన ఈ పరిశోధనలో వెల్లడైంది. గుజరాత్ రాష్ట్రంలో కేజ్రివాల్ పర్యటనకు ముందు, తర్వాత అతనికి, పార్టీకి ఉన్న మద్దతుపై ఈ సర్వే నిర్వహించారు. అయితే గుజరాత్ రాష్ట్రంలో కేజ్రివాల్‌కు ఉన్న మద్దతు ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన తర్వాత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. కాగా ఈ సర్వేను ఓహియో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ నాలెడ్జ్-ఎనాబుల్ కంప్యూటింగ్ రైట్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు శ్రేయాన్ష్ భట్ ప్రచురించారు.

యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ అమిత్ షెట్ ఇప్పటి వరకు సహజ ప్రకృతి వైపరీత్యాలు, మహిళపై జరుగుతున్న హింసాత్మాక సంఘటనలు లాంటి మానవ సంబంధమైన, అభివృద్ధి పరమైన అంశాలపై పరిశోధనలు, సర్వేలు నిర్వహించారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కేజ్రివాల్ గుజరాత్ పర్యటనతో న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

అదే సమయంలో గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రివాల్ కారుపై బిజెపి కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఆయనను గుజరాత్ పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం ముందు ఆప్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అంతేగాక బిజెపి కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. ఆ తర్వాత ఆప్ పార్టీ నేత మనీష్ సిసోడియా తన కారుపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాతి రోజునే (మార్చి 6) గుజరాత్ పర్యటనలో లౌడ్ స్పీకర్లు ఉపయోగించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలతో కుచ్ జిల్లాలోని గాంధీధామ్ పోలీసులు కేజ్రివాల్‌పై కేసు నమోదు చేశారు.

చివరకు ఆప్ నాయకుడు కేజ్రివాల్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై పలు ఆరోపణలు చేశారు. రోడ్ షో, ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ.. మోడీ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ చెప్పిన విధంగా ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేజ్రివాల్ ఆరోపించారు. మోడీని కలిసేందుకు ప్రయత్నించి కేజ్రివాల్‌కు అందుకు అనుమతి లభించలేదు.

ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మోడీని కలవాలని కేజ్రివాల్ చెప్పడం పబ్లిసిటీలో భాగమేనని బిజెపి నేతలు కేజ్ర్రీపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కేజ్రివాల్ చేసిన ఆరోపణలు మరింత దుమారం రేపాయి. మోడీ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థులను కొనడం లేదా చంపేయడం చేసి గెలుపొందారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో బిజెపి ఎన్నికల సంఘానికి కేజ్రివాల్‌పై ఫిర్యాదు చేసింది. కేజ్రివాల్ చేసిన ఈ ఆరోపణలు, నాటకీయ పరిణామాలతో సాగిన గుజరాత్ పర్యటన ఆప్ పార్టీకి, కేజ్రివాల్‌కి ఉన్న పాపులారిటీని మరింత తగ్గించాయని చెప్పవచ్చు.

తగ్గిన కేజ్రి పాపులారిటీ

తగ్గిన కేజ్రి పాపులారిటీ

ఈ గ్రాఫ్ గమనించినట్లయితే ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రివాల్ గుజరాత్ పర్యటనతో అతని పాపులారిటీ తగ్గిన విషయం తెలుస్తోంది. మార్చి 5 నుంచి 7 వరకు నిర్వహించిన గుజరాత్ పర్యటనతో కేజ్రివాల్‌పై ఆ రాష్ట్రంలో వ్యతిరేకత ఏ మేర పెరిగిందో ఈ గ్రాఫ్‌తో తెలుస్తోంది.

దిగజారిన కేజ్రి పాపులారిటీ

దిగజారిన కేజ్రి పాపులారిటీ

ఈ గ్రాఫ్ గమనించినట్లయితే గుజరాత్ పర్యటనకు ముందు, తర్వాత అరవింద్ కేజ్రివాల్‌కు అనుకూల, వ్యతిరేకతలు తెలుస్తాయి. ట్విట్టర్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైనవే ఈ ఫలితాలు.

అహ్మదాబాద్‌లో..

అహ్మదాబాద్‌లో..

శనివారం అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో పబ్లిక్ ర్యాలీలో ప్రసంగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్.

ప్రసంగిస్తున్న కేజ్రివాల్

ప్రసంగిస్తున్న కేజ్రివాల్

గుజరాత్ పర్యటన సందర్భంగా ఆప్ మద్దతుదారులనుద్దేశించి ప్రసంగిస్తున్న అరవింద్ కేజ్రివాల్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+