
సూర్యకుమార్ యాదవ్: 11ఏళ్ల నిరీక్షణ తర్వాత సూపర్ బ్యాట్స్‌మన్‌గా ఎలా విజృంభిస్తున్నాడు?

భారత క్రికెట్ జట్టులో సూపర్ హిట్టర్‌గా సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే, ఈ స్థానానికి చేరుకునేందుకు అతడు ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
2010 డిసెంబరు 10న ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో దేశీయ క్రికెట్‌లోకి సూర్యకుమార్ అరంగేట్రం చేశాడు. కానీ, దేశం కోసం ఆడేందుకు ఆయనకు తొలి అవకాశం 2021 మార్చి 14న వచ్చింది.
అంటే, దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు దాదాపు 11ఏళ్లు సూర్యకుమార్ ఎదురుచూడాల్సి వచ్చింది.
అయితే, ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాలో తన బ్యాటింగ్‌తో చెలరేగుతూ ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ అతడు వార్తల్లో నిలుస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టును సెమీ ఫైనల్స్‌కు చేర్చడంలో సూర్యకుమార్ ప్రధాన పాత్ర పోషించారు.
360 డిగ్రీల బ్యాట్స్‌మన్‌గా మన్ననలు పొందుతున్న సూర్యకుమార్‌ను.. ఫీల్డ్‌లోని ఈ మూలకైనా షాట్‌లు కొట్టగలిగే బ్యాట్స్‌మన్‌గా నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయన్ను దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డెవిలియర్స్‌తో పోలుస్తున్నారు.
- సూర్యకుమార్ యాదవ్ భార్య పెట్టిన 'రూల్' ఏంటి, దాన్ని పాటించడం వల్లే అతడు ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నాడా?
- బ్రిటిష్ వలస పాలనలో భారతీయ మహిళలను టార్గెట్ చేసిన సబ్బులు, క్రీముల ప్రకటనలు ఎలా ఉండేవి?

హస్సీ బాటలో...
సూర్యకుమార్ కెరియర్‌లో చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. దేశీయ క్రికెట్‌లో మంచి రన్లు కొడుతున్నప్పటికీ అతడికి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కలేదు. కానీ, సూర్యకుమార్ తనపై ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు.
కెరియర్ తొలినాళ్లలో తనకు కష్టాలు ఎదురైనప్పుడు ఆస్ట్రేలియ క్రికెట్ దిగ్గజం మైఖేల్ హస్సీని సూర్యకుమార్ తలచుకునేవారు. హస్సీ అంటే సూర్యకుమార్‌కు విపరీతమైన అభిమానం.
హస్సీ కూడా ఇలానే ఆస్ట్రేలియా జట్టులో చోటు కోసం దాదాపు పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ విషయంలో హస్సీ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. అసంతృప్తి కూడా వ్యక్తం చేయలేదు. దేశీయ క్రికెట్‌లో ప్రతిభ చూపిస్తూ అతడు ముందుకు వెళ్లేవాడు. చివరగా అదే అంతర్జాతీయ క్రికెట్ జట్టులో అతడికి చోటు తెచ్చిపెట్టింది.
వేగంగా మారే క్రికెట్ ప్రపంచంలో మూడుపదుల వయసంటే కెరియర్‌లో చివరి అంకమనే చెప్పుకోవాలి. హస్సీకి కూడా ఇలానే 30ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కింది. అతడికి పెద్దగా సమయం లేదు. కానీ, ఉన్న సమయాన్నే అతడు మెరుగ్గా ఉపయోగించుకున్నాడు.
- టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం
- టీ20 వరల్డ్ కప్: సెమీ పైనల్స్‌కు చేరిన భారత్, పాకిస్తాన్... బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం

అలా పోలిక..
సూర్యకుమార్ యాదవ్ తండ్రి కూడా ఎప్పటికప్పుడు తన కుమారుడిని హస్సీతో పోల్చేవారు. నేడు సూర్యకుమార్ కూడా హస్సీలానే క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
హస్సీలానే సూర్యకుమార్‌కు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడే అవకాశం 30 ఏళ్ల తర్వాతే వచ్చింది. అయితే, ఏడాదిన్నరలోనే ఐసీసీ టీ20 ఫార్మాట్ బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో సూర్యకుమార్ టాప్‌కు చేరుకున్నారు.
ప్రతిభ, నైపుణ్యం, ఫిట్‌నెస్, ఒత్తిడిని ఎదుర్కోవడం, గేమ్‌ను అర్థం చేసుకోవడం ఇలా అన్నింటా తనేంటో సూర్యకుమార్ నిరూపించుకున్నారు.
ఐపీఎల్ టోర్నమెంట్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆడేటప్పుడు కూడా మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకు కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు కూడా ఆయన ఆడారు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరఫున ఆడే అవకాశం సూర్యకుమార్ యాదవ్‌కు గౌతమ్ గంభీర్ ఇచ్చారు. అప్పుడే ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ దృష్టి సూర్యకుమార్‌పై పడింది.
- విరాట్ కోహ్లీపై ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలు, 5 పరుగులు పెనాల్టీగా ఇస్తే బంగ్లాదేశ్ ఇండియాపై గెలిచేదా
- పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ తర్వాత మిస్టర్ బీన్ పేరు ఎందుకు ట్రెండ్ అవుతోంది?

మంచి ఆటగాడిగా గుర్తింపు
2018లో ముంబయి ఇండియన్స్ జట్టు కోసం సూర్యకుమార్‌ను రోహిత్ శర్మ ఎంచుకున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ అదృష్టం తిరిగిందని చెప్పుకోవాలి.
ముంబయి ఇండియన్స్ జట్టుకు వెన్నెముకలా సూర్యకుమార్ మారారు. అయినప్పటికీ భారత క్రికెట్ జట్టు ద్వారాలు ఆయన కోసం తెరచుకోలేదు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో రన్లు కొడుతున్నప్పటికీ అతడిని వెయిటింగ్ లిస్టులోనే ఉంచారు. మొత్తానికి 2021లో అతడికి జట్టులో చోటు దక్కింది.
సూర్యకుమార్ జాదవ్ తండ్రి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో పనిచేసేవారు. సూర్యకుమార్‌తోపాటు ఆయన తల్లి, సోదరి, భార్య అందరూ చెంబూర్ సమీపంలోని అణుశక్తినగర్‌లో ఉంటారు.
సూర్యకుమార్‌కు క్రికెట్‌పై విపరీతమైన ఆసక్తి ఉందని చిన్నప్పుడే అతడి కుటుంబం గుర్తించింది. టెన్నిస్ పోటీల్లోనూ అతడు ముందుండేవాడు. క్రికెట్ విషయానికి వస్తే, ముంబయి క్రికెట్ అసోసియేషన్‌లోని అండర్-15, అండర్-17 పోటీల్లో అతడు ప్రతిభ చూపాడు.
ముంబయి జట్టులో అతడికి చోటు దక్కింది. ముంబయి క్రికెటర్లు చివరివరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. మరాఠీలో దీన్నే ''ఖడూస్ హోనా’’అని పిలుస్తారు.
కఠిన పరిస్థితుల్లోనూ సూర్యకుమార్ ఆటతీరులో ఎలాంటి మార్పూ కనిపించదని క్రికెట్ విమర్శకులు కూడా చెబుతుంటారు.
వేగంగా పరుగులు తీసేవరకూ భారత క్రికెట్ జట్టు తలుపులు తన కోసం తెరచుకోవని సూర్యకుమార్ భావించేవారు.
ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్.. ఐపీఎల్‌లో మిడిల్ ఆర్డర్‌గా బరిలోకి దిగేవారు. దీంతో ఆయన స్థానం తరచూ మారుతూ ఉండేది. మరోవైపు తనతో ఆడేవారికి భారత జట్టులో చోటు లభించేది. కానీ, అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
గత రెండేళ్లలో ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ టాప్‌లో నిలుస్తూ వస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ కొట్టిన రికార్డు అతడి పేరిట ఉంది.
- టెండూల్కర్‌తో మాట్లాడమని కోహ్లీకి గావస్కర్ ఎందుకు సలహా ఇచ్చారు?
- లార్డ్స్‌లో ఇంగ్లండ్ చేసిన ఆ ఒక్క తప్పే భారత్‌కు ఘన విజయాన్ని ఇచ్చిందా?

బడా పావ్, పావ్ భాజీ, షెజ్వాన్ రైస్
సూర్యకుమార్ ముంబయిలో పెరిగారు. అతడిని ముంబైకర్‌గా చెప్పుకోవచ్చు. ''బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’’ ప్రోగ్రామ్‌లో గౌరవ్ కపూర్‌తో మాట్లాడుతూ.. ఫుడ్ అంటే తనకు ఎంత ఇష్టమో సూర్యకుమార్ వివరించారు. అతడికి బడా పావ్, పావ్ భాజీ, చైనీస్ ఫుడ్ ముఖ్యంగా షెజ్వాన్ రైస్ అంటే చాలా ఇష్టమని చెప్పారు.
క్రికెట్ ఆడేవారికి ఫుడ్‌పై నియంత్రణ చాలా అవసరం. అందుకే ఇప్పుడు వీటిని సూర్యకుమార్ తీసుకోవడం లేదు.
సూర్యకుమార్‌కు మరాఠీ బాగా వచ్చు. విలేఖరుల సమావేశంలో మరాఠీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు అతడు మరాఠీలోనే సమాధానం ఇస్తారు.
''స్కై’’ అనే పేరు ఎలా వచ్చింది?
ఐపీఎల్ 2014 సీజన్ నుంచి కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు సూర్యకుమార్ ఆడటం మొదలుపెట్టారు. అప్పట్లో ఆ జట్టుకు గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉండేవారు.
ప్రాక్టీస్ సమయంలో సూర్యకుమార్‌ను గంభీర్ ''స్కై’’అని పిలిచేవారు. మొదట్లో దీన్ని సూర్యకుమార్ అంత పట్టించుకునేవారు కాదు. కానీ, దీనికి అర్థం ఏమిటని ఒకసారి అడిగినప్పుడు.. తన పేరులోని మూడు పదాల్లో మొదటి అక్షరాలను కలిపినప్పుడు స్కై అనే పదం వస్తుందని గంభీర్ సమాధానం ఇచ్చారు.
- ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదు? అసలు ఆ ప్రయత్నాలేమైనా జరిగాయా
- ధోనీ హెలికాప్టర్ షాట్ ఎలా పుట్టింది? ఆ టెక్నిక్ నేర్పిందెవరు?

గణేశుడి భక్తుడు, టాటూలు అంటే ఇష్టం..
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ముంబయిలోని సిద్ధివినాయక్ గణపతి ఫోటోలను తరచూ సూర్యకుమార్ యాదవ్ షేర్ చేస్తుంటారు.
మరోవైపు సూర్యకుమార్ శరీరంపై చాలా పచ్చబొట్లు కనిపిస్తారు. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. తల్లిదండ్రుల ఫోటో ఒకచోట, భార్య పేరు మరోచోట అతడు టాటూగా వేయించుకున్నాడు.
ఎడమ భుజంపై మోవొరీ సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలు కనిపిస్తాయి. క్రికెట్‌పై టూర్‌లకు వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన పెంపుడు శునకాలు పాబ్లో, ఓరియోలను అతడు మిస్ అవుతుంటారు. ఇవి ఫ్రెంచ్ బుల్‌డాగ్‌లు.
సూర్యకుమార్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఈ ఏడాది రూ.2.5 కోట్లు పెట్టి మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేశాడు. నిస్సాన్ జోంగా, రేంజ్ రోవర వెలార్, మిని కూపర్, ఆడి ఆర్5 కార్లు అతడి దగ్గర ఉన్నాయి.
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు

రోహిత్ శర్మ సంకేతాలు..
ఐపీఎల్ కోసం ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ 30వ పుట్టినరోజునాడు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇండియా క్యాప్ త్వరలోనే వస్తుందని సంకేతాలు ఇచ్చారు. రోహిత్ మాటలు నిజం అయ్యాయి. కొన్ని నెలల్లోనే అతడికి భారత జట్టు కోసం ఆడే అవకాశం దక్కింది.
సూర్యకుమార్ కెరియర్‌లో ముందుకు వెళ్లడంలో రోహిత్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ముంబయి ఇండియన్స్ జట్టులోకి తీసుకురావడం లేదా, భారత జట్టులో చోటు ఇవ్వడం ఇలా అన్నింటా రోహిత్ ప్రధాన పాత్ర పోషించారు.
మీడియాతో మాట్లాడుతూ.. ''నేను రంజీలో అడుగుపెట్టినప్పుడు అక్కడ రోహిత్ ఉన్నారు. ఆయన మొదట్నుంచీ నాకు అండగా నిలిచారు’’అని చెప్పారు.
- భారత్ ఓటమిపై పాకిస్తాన్లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు
- 'ఆ చివరి మూడు ఓవర్లు చూస్తూ దీపావళి పండుగ చేసుకున్నా' - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సోషల్ మీడియాలో చర్చ
దేవీశాతో ఏడు అడుగులు..
2017లో సూర్యకుమార్, దేవిశాలకు వివాహమైంది. 2010 నుంచే వీరు ప్రేమించుకున్నారు. తన కెరియర్ ముందుకు వెళ్లేందుకు దేవిశా కూడా చాలా కృషి చేశారని సూర్యకుమార్ తరచూ చెబుతుంటారు.
''నువ్వు ముంబయి కోసం ఆడుతున్నావు. ఐపీఎల్‌లో కూడా ప్రతిభ చూపిస్తున్నావు. కానీ, నీ కెరియర్ ఎందుకు ముందుకు వెళ్లడం లేదు. అని ఆమె ప్రశ్నించేది. ఆ తర్వాత ఇద్దరమూ కలిసి కూర్చొని పక్కా ప్రణాళికలు వేశాం’’అని ఆయన చెప్పారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్, డైటింగ్ కోచ్‌ల దగ్గరకు సూర్యకుమార్ వెళ్లారు. రాత్రిపూట ఆలస్యంగా పార్టీలు చేసుకోవడాన్ని పూర్తిగా ఆపేశారు. నెమ్మదిగా తనుచేసిన కృషికి ఫలితం కనిపించడం మొదలైంది.
సచిన్‌కు గాయం.. ఐపీఎల్‌లో అరంగేట్రం..
2012 ఏప్రిల్ 6న తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ ఆడారు. అది కూడా ముంబయి ఇండియన్స్ కోసమే. పూణె వారియర్స్‌పై ఆడాల్సిన ఆ మ్యాచ్‌కు గాయాల వల్ల సచిన్ తెందూల్కర్ దూరమయ్యారు. దీంతో సూర్యకుమార్‌కు అవకాశం వచ్చింది.
సచిన్ లాంటి దిగ్గజాల స్థానంలో ఆడేందుకు చాలా తక్కువమందికే అవకాశం వస్తుంది. అయితే, ఆ మ్యాచ్‌లో ఆరో బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
అయితే, తన పక్కన కూర్చొనే అవకాశాన్ని సచిన్ అప్పుడు ఇవ్వడాన్ని ఇప్పటికీ సూర్యకుమార్ మరచిపోలేదు.
- INDvPAK: భారత్‌ను గెలిపించిన చివరి ఓవర్ నాలుగో బంతిపై సోషల్ మీడియాలో చర్చ ఎందుకు జరుగుతోంది?
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
ఆ షాట్ ఎలా కొట్టాలో చూపిస్తావా? కల్లిస్ అడిగినప్పుడు...
2016లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు కోసం సూర్యకుమార్ ఆడుతున్నారు. కేకేఆర్ కోసం సూర్యకుమార్ మంచి షాట్లు కొట్టారు. దిగ్గజ ఆల్‌రౌండర్లలో ఒకరైన జాక్వెస్ కల్లిస్ ఆ జట్టుకు కోచ్‌గా ఉండేవారు.
ఆ షాట్లు ఎలా కొట్టాలో ఒకసారి చూపించని సూర్యకుమార్‌కు కల్లిస్ కూడా అడిగేవారు.
జోఫ్రా ఆర్చర్ తొలి బంతికి సిక్స్
ప్రపంచంలో ఫాస్ట్ బౌలర్‌గా జోఫ్రా ఆర్చర్‌కు పేరుంది. జోఫ్రా బౌలింగ్ అంటే బ్యాట్స్‌మన్‌లకు తలనొప్పిగా ఉంటుంది.
సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలుత బరిలోకి దిగారు. రోహిత్ శర్మను జోఫ్రా అవుట్ చేశారు. దీంతో అతడి స్థానంలో సూర్యకుమార్ వచ్చారు.
లెగ్ స్టంప్‌పై జోఫ్రా వేసిన బౌన్సర్‌ను నటరాజ్ స్టైల్‌లో కొట్టి సూర్యకుమార్ స్టేడియాన్ని దాటించారు. ఆ సిక్స్‌ను చూసి స్టేడియం మొత్తం ఆశ్చర్యపోయింది.
నిజానికి కొత్తగా వచ్చే ప్లేయర్లకు చాలా ఒత్తిడి ఉంటుంది. అది కూడా జోఫ్రా బాల్స్‌కు ఎదురు నిలవాలంటే మరింత కష్టం. కానీ, సిక్స్‌తో సూర్యకుమార్ శుభారంభం చేశారు.
- INDvsPAK: విరాట్ స్వరూపంతో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
- భారతదేశంలో ఎలాంటి రుజువులూ, గుర్తింపు లేని 'గూఢచారులు’
''జీ సినిమా’’ పేరు
సూర్యకుమార్ ఆల్‌రౌండ్ గేమ్‌ను చూసిన క్రికెట్ విశ్లేషకుడు సౌరభ్ వల్కర్ అతడికి ''జీ సినిమా’’అనే పేరు పెట్టారు.
క్రిక్ఇన్ఫో వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సౌరభ్ మాట్లాడుతూ... ''యాక్షన్, ఫన్, డ్రామా అన్నీ అతడి గేమ్‌లో కనిపిస్తాయి. అందుకే ఆయన ఓ జీ సినిమా’’అని వ్యాఖ్యానించారు.
టీ20 వరల్డ్ కప్‌కు ప్రత్యేక సన్నద్ధత
టీ20 వరల్డ్ కప్‌కు సన్నద్ధం అయ్యేందుకు పార్సి జిమ్‌ఖానా గ్రౌండ్‌లో గ్రీన్ పిచ్ సిద్ధం చేయాలని సూర్యకుమార్ యాదవ్ కోరినట్లు చాలా మందికి తెలియదు. గ్రీన్ పిచ్‌లపై బాల్ బౌన్స్ అవుతుంది.
ఈ పిచ్‌లపై సూర్యకుమార్ చాలా ప్రాక్టీస్ చేశారు. మాజీ ముంబయి ప్లేయర్ వినాయక్ మానే మార్గదర్శకంలో అతడు శిక్షణ తీసుకున్నారు.
''ప్రతి రోజూ నాలుగు గంటలపాటు సూర్యకుమార్ షాట్‌లను మరింత మెరుగుపరచడంపై దృష్టిసారించేవారు. అలా ఆయన ప్రాక్టీస్ ముందుకు వెళ్లింది’’అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు మకరంద్ వాయంగ్కర్ ఇటీవల ఒక ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- 'ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’ – రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దిగ్భ్రాంతి, ఆగ్రహం
- టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?
- టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ ఫైనల్‌కు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)