యాహూ టాప్ మోస్ట్ సెర్చ్ సెలబ్రిటీలు 2020.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి .. హీరో ఆఫ్ ది ఇయర్ సోనూసూద్
ప్రముఖ సెర్చ్ ఇంజన్ యాహూ ఇండియా 2020 ఇయర్ ఇన్ రివ్యూ వినియోగదారుల రోజువారి శోధన ఆధారంగా ఈ సంవత్సరం అత్యధికంగా యాహు సెర్చ్ ఇంజన్ లో శోధించిన ప్రముఖుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి స్థానంలో నిలవగా, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మహిళల కేటగిరీలో అత్యధికంగా శోధించిన సెలబ్రిటీ గా నిలిచింది. యాహూ ఇయర్ ఇన్ రివ్యూ (వైఐఆర్) జాబితాలో సోను సూద్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ సమయంలో వలస కూలీలు ఇంటికి చేరుకోవడానికి సహాయం చేసినందుకు ఆయనను హీరో ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేశారు.

యాహూ లో ప్రధాని మోడీ కంటే అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ .. సుశాంత్ సింగ్ రాజ్ పూత్
2020 జూన్ లో మరణించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ యాహు సెర్చ్ ఇంజన్ లో అందరికంటే ఎక్కువగా శోధించబడిన పర్సనాలిటీ. ఈ ఏడాది ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ కంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎక్కువగా శోధించిన సెలబ్రిటీ కాగా, మహిళల్లో రియా చక్రవర్తి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
2017 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి మొదటి స్థానంలో లేరు. వినియోగదారుల రోజువారీ శోధన ఆధారంగా 2020 సంవత్సరానికి అగ్రశ్రేణి వార్తలను, సంఘటనలను, సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను యాహూ లిస్టింగ్ చేస్తుంది.

టాప్ న్యూస్ మేకర్ 2020 లో ప్రధాని మోడీకి మొదటి స్థానం
అందులో భాగంగా మంగళవారం విడుదల చేసిన ఏడాది ముగింపు జాబితా ప్రకారం
నరేంద్ర మోడీ 2020 లో టాప్ న్యూస్ మేకర్ గా నిలిచారు . నరేంద్ర మోడీ తర్వాత స్థానంలో, అంటే రెండో స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రియా చక్రవర్తి నిలువగా, మూడో స్థానంలో రాహుల్ గాంధీ న్యూస్ మేకర్ గా నిలిచారు . ఈ జాబితాలో అమిత్ షా, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్ పదో స్థానంలో, దీపికా పదుకొనే 12వ స్థానంలో, సన్నీ లియోన్ 14వ స్థానంలో, ప్రియాంక చోప్రా 15వ స్థానంలో, కత్రినా కైఫ్ 16వ స్థానంలో నిలిచారు.

మేల్ సెలెబ్రిటీ కేటగిరీలో అగ్రస్థానంలో సుశాంత్ .. టాప్ 10 మోస్ట్ సెర్చ్ మేల్ సెలబ్రిటీలు వీళ్ళే
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మేల్ సెలెబ్రిటీ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా యాహూ లో సెర్చ్ చేసిన మేల్ సెలబ్రిటీల విభాగంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అగ్రస్థానంలో నిలిచారు. టాప్ మోస్ట్ సెర్చ్ మేల్ సెలబ్రిటీస్ జాబితాలో మొదటి స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రెండవ స్థానంలో అమితాబచ్చన్ , మూడవ స్థానంలో అక్షయ్ కుమార్ , నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్, ఐదో స్థానంలో ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ , ఆరో స్థానంలో దివంగత రిషి కపూర్, ఏడవ స్థానంలో దివంగత గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం, 8వ స్థానంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్, 9వ స్థానంలో అనురాగ్ కశ్యప్, పదవ స్థానంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నిలిచారు

మహిళల టాప్ సెలిబ్రిటీ కేటగిరీలో అగ్రస్థానంలో రియా చక్రవర్తి .. టాప్ 10 మహిళా ప్రముఖులు వీళ్ళే
రియా చక్రవర్తి మహిళల టాప్ సెలిబ్రిటీ కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్నారు. భారతదేశంలో అత్యధికంగా శోధించిన మహిళల జాబితాలో రియా చక్రవర్తి మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో కంగనా రనౌత్ రెండవ స్థానంలో, దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా ఉన్నారు. ఎక్కువగా శోధించిన మహిళా ప్రముఖులలో కత్రినా కైఫ్ కూడా ఉన్నారు. ఇటీవల రోహన్‌ప్రీత్ సింగ్ ను పెళ్లి చేసుకున్న నేహా కక్కర్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. కరోనా మహమ్మారి తొలి రోజుల్లో కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన కనికా కపూర్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. కరీనా కపూర్ మరియు సారా అలీ ఖాన్ వరుసగా 9 మరియు 10 వ స్థానంలో ఉన్నారు.

సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ కేటగిరీలో అగ్రస్థానంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ
2020 విభాగంలో సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ కేటగిరీలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ సంవత్సరం తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. వారు రెండవ స్థానంలో నిలిచారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా కూడా ఈ ఏడాది తమ కుమార్తె సమీషా రాకతో జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారు 3 వ స్థానంలో ఉన్నారు.