బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Swamiji: అమ్మాయిల లైంగిక వేధింపుల కేసులో స్వామీజీకి షాక్, విద్యార్థుల రహస్య విచారణ, బెయిల్ పిటిషన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిత్రదుర్గా: విద్యాసంస్థలో చదువుకుంటున్న మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ స్వామిజీ, మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుకు కోర్టులో చుక్కెదురైయ్యింది. తన మీద వచ్చిన లైంగిక వేధింపుల కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ దెబ్బతో మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుతో పాటు ఆయన అనచురులు, శిష్యులు ఆయోమయంలో పడిపోయారని తెలిసింది.

EX wife: లవ్ మ్యారేజ్, ఎంజాయ్ చేస్తున్న జులాయి, దానికితోడు డౌట్, అర్దరాత్రి భార్య చేతిలో కుక్కచావు !EX wife: లవ్ మ్యారేజ్, ఎంజాయ్ చేస్తున్న జులాయి, దానికితోడు డౌట్, అర్దరాత్రి భార్య చేతిలో కుక్కచావు !

మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులు ?

మైనర్ అమ్మాయిల మీద లైంగిక వేధింపులు ?

కర్ణాటకలోని చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు చాలా ఫేమస్ స్వామీజీ అనే విషయం కర్ణాటకలో కొత్తగా చెప్పనవసరం లేదు. మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్న మైనర్ అమ్మాయిలను డాక్టర్ శివమూర్తి మురగా శరణరు లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 ముందస్తు బెయిల్ ఇవ్వాలని స్వామీజీ పిటీషన్

ముందస్తు బెయిల్ ఇవ్వాలని స్వామీజీ పిటీషన్

తమ మీద డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మైనర్ అమ్మాయిలు స్వామీజీ మీద కేసు పెట్టారు. మైనర్ అమ్మాయిలు కేసు పెట్టడంతో డాక్టర్ శివమూర్తి మురుగా శరణరు తరపు న్యాయవాది కేఎన్, విశ్వనాథ్ ఆగస్టు 29వ తేదీన స్వామీజీకి ముందస్తు జామీను మంజూరు చెయ్యాలని చిత్రదుర్గాలోని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

కోర్టులో మైనర్ అమ్మాయిలు హాజరు

కోర్టులో మైనర్ అమ్మాయిలు హాజరు

గురువారం ఉదయం 11 గంటల సమయంలో చిత్రదుర్గా జిల్లా అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కే. కోమలా పిటిషన్ విచారణ చేశారు. ఆ సందర్బంలో బాధితులు అయిన అమ్మాయిలు, వాళ్ల తల్లిదండ్రులు హాజరైనారు. అమ్మాయిల తరుపున కర్ణాటక హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్ హాజరైనారు. ఆ సందర్బంలో న్యాయమూర్తి జస్టిస్ కోమలా మిగిలిన న్యాయవాదులు అందరిని బయటకు పంపించేశారు.

 రహస్య విచారణ చేసిన న్యాయమూర్తి

రహస్య విచారణ చేసిన న్యాయమూర్తి

అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల నుంచి న్యాయమూర్తి జస్టిస్ కోమలా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత అమ్మాయిల నుంచి వివరాలు సేకరించిన న్యాయమూర్తి జస్టిస్ కోమలా స్వామీజీ బెయిల్ పిటిషన్ ను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఈ దెబ్బతో మఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగా శరణరుతో పాటు ఆయన అనచురులు, శిష్యులు ఆయోమయంలో పడిపోయారని తెలిసింది.

English summary
Swamiji Sexually assaulted case: Murugha mutt Shivamurthy Sharana Swamiji's bail plea application hearing postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X