నిత్యానంద అంటే తమాషానా: ఫుల్ మజాకా

Posted By:
Subscribe to Oneindia Telugu

మైసూరు/బెంగళూరు: బహుబాష నటితో రాసలీలలు సాగించిన కేసులో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బిడిది ధ్యానపీఠకు చెందిన స్వామి నిత్యానంద అలియాస్ నిత్యానంద, ఆయన అనుచరులు మళ్లీ వివాదానికి కారణం అయ్యారని ఆరోపణలు వచ్చాయి.

దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన శ్రీ మేలుకోటే దేవాలయానికి వెళ్లిన నిత్యానంద, ఆయన అనుచరులు పాదరక్షలు వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో భక్తులు వారిని అడ్డుకున్నారు.

నిత్యనంద వచ్చిన విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడ వీడియో, ఫోటోలు తియ్యడానికి వెళ్లిన సమయంలో ఆయన అనచరులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారని సమాచారం.

Swamy Nithyananda visits Melukote Cheluvanarayana swamy temple

మైసూరుకు సమీపంలో ఉన్న శ్రీ మేలుకోటే దేవాలయానికి నిత్యానంద తన అనుచురులతో కలిసి వెళ్లారు. శ్రీ మేలుకోటే ఆలయం నియమాల ప్రకారం మద్యాహ్నం 1 గంట సమయంలో ఆలయం తలుపులు మూసివేయాలి.

అయితే మద్యాహ్నం 1.45 గంటల వరకు నిత్యానంద కోసం ఆలయం తలుపులు తీసి ప్రత్యేక పూజలు చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిత్యానంద, ఆయన భక్తులు ఆలయంలోకి పాదరక్షలు వేసుకుని వెలుతుంటే భక్తులు వారిని అడ్డుకున్నారు.

Swamy Nithyananda visits Melukote Cheluvanarayana swamy temple

తరువాత పాదరక్షలు తీసివేసి ఆలయం లోపలికి వెళ్లారని సమాచారం. తరువాత మేలుకోటేలోని చెలువనారాయణ స్వామి, యదుగిరి నాయకి, రామానుజ స్వామి దర్శనం చేసుకున్న నిత్యానంద సాంసృతిక పరిశోదనా సంస్థలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.

అక్కడ నిత్యానందను ఫోటోలు తియ్యడానికి ప్రయత్నించిన వారి మీద ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. దేవాలయం నిర్వహకులు, అర్చకులు వీవీఐపీలను ఆహ్వానించినట్లు భారీ గజమాల వేసి నిత్యానందకు స్వాగతం పలకడంతో పలువురు భక్తులు మండిపడుతున్నారు.

Swamy Nithyananda visits Melukote Cheluvanarayana swamy temple

రాసలీలల కేసులు, అత్యాచారం, బెదిరింపు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు ఇంతటి ఘన స్వాగత ఏర్పాట్లు చెయ్యడం అవసరమా ? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని బిడిదిలో నిత్యానంద ధ్యానపీఠ ఆశ్రయం ఉంది. ధ్యానపీఠ ఆశ్రయం పేరుతో మేలుకోటేలో నిత్యానంద సాంసృతిక పరిశోదనా సంస్థలో ఏర్పాటు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nithyananda visits Melukote Cheluvanarayana swamy temple on Wednesday along with his followers.
Please Wait while comments are loading...