చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వాతి హత్య: రామ్ కుమార్ కోసం వాగుడు కాయలు

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ కోసం అధికారులు జైలులో ఇద్దర సహచర ఖైదీలను నియోగించారు. వాగుడు కాయలైన ఆ ఇద్దరు రామ్ కుమార్‌ను మాటల్లోకి దించుతూ అతన్ని సాధారణ స్థితిలో ఉంచడదానికి ప్రయత్నిస్తారు. అతనిలో ఆత్మహత్య చేసుకోవాలనే లక్షణాన్ని పారదోలడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకోకుండా కాపలా కాయడానికి అదనపు గార్డులను నియమించిన తర్వాత కూడా ఆ ఇద్దరిని ప్రత్యేకంగా అతని కోసం నియోగించారు. స్వాతి హత్య కేసులో చెన్నై పోలీసులు ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. బహుశా అది పఝల్ జైలు ఆవరణలో సోమవారంనాడు జరిగే అవకాశం ఉంది.

స్వాతి హత్య కేసులో ట్విస్ట్: ధనుష్ సినిమాలు ప్రేరణ?స్వాతి హత్య కేసులో ట్విస్ట్: ధనుష్ సినిమాలు ప్రేరణ?

Swathi murder: Ramkumar lodged with 'chatty' inmates 'to keep spirit up'

సాక్షులను అధికారులు జైలుకు రప్పించి రామ్ కుమార్‌ను గుర్తించాలని అడిగే అవకాశం ఉంది. సాక్షుల ముందు రామ్ కుమార్‌తో పాటు ఇతర ఖైదీలను కూడా పరేడ్ చేయిస్తారు. ఈ వారంలోనే ఐడెంటిఫికేషన్ పరేడ్, అనుమానితుడి విచారణ ముగుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

చులైమెడులో మృతురాలు ఉండే చోటుకు సమీపంలోనే రామ్ కుమార్ లాడ్జిలో ఉంటూ వచ్చాడు. ప్రేమే పేరుతో అతను ఆమె వెంటపడుతూ వచ్చాడు. చివరకు జూన్ 24వ తేదీన నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో ఆమెను హత్య చేశాడు.

English summary
P. Ramkumar, the alleged killer of Infosys techie S. Swathi, has been spending his days in jail with chatty inmates even as extra guards have been assigned to keep a suicide watch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X