వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిండికేట్ బ్యాంక్‌లో వెయ్యి కోట్ల స్కాం!: సిబిఐ దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఫోర్జరీ, తప్పుడు బిల్లుల ద్వారా రూ. వెయ్యి కోట్ల నిధులను కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారుల పాత్రపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, జైపూర్, ఉదయ్‌పూర్‍లలో మంగళవారం సిబిఐ అధికారులు దాడులు చేశారు. సిండికేట్ బ్యాంక్ కార్యాలయాలు, అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం పది ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్లు సిబిఐ ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

 Syndicate Bank fraud: CBI conducts searches at 10 locations

గతంలో కూడా సిండికేట్ బ్యాంకులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. గతంలో సిండికేట్ బ్యాంక్ సిఎండిగా పని చేసిన సుధీర్ కుమార్ జైన్‌ను రూ. 50లక్షలు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో అతడ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
The Central Bureau of Investigation on Tuesday carried out searches at 10 locations in Jaipur, Udaipur and Delhi in connection with alleged fraud of Rs 1,000 crore in Syndicate Bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X