లఖింపూర్ ఖేరీ ఘటన : రైతులపై ప్లాన్ ప్రకారమే దాడులు ; అనుమతి నిరాకరించినా సరే రాహుల్ గాంధీ పర్యటన !!
లఖింపూర్ ఖేరిలో హింసాకాండ దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ జిల్లాలో ఈరోజు రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిషేధాజ్ఞల పేరుతో యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినా, రాహుల్ గాంధీ మాత్రం తన పర్యటనను కొనసాగిస్తానని లఖింపూర్ ఖేరికి బయలుదేరారు.

రైతులను ప్రభుత్వం అవమానిస్తూనే ఉందన్న రాహుల్ గాంధీ
ఇదిలా ఉంటే లఖింపూర్ ఖేరికి బయలుదేరేముందు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో రైతులు ఒక క్రమపద్దతిలో ఒక ప్లాన్ ప్రకారం దాడులకు గురవుతున్నారని, వారిని ప్రభుత్వం అడుగడుగునా అవమానిస్తూ ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ, హింసాకాండ బాధితుల కుటుంబాలను కలిసేందుకు లఖింపూర్ ఖేరీకి ఈరోజు ప్రతినిధుల బృందంతో కలిసి వెళ్లడానికి బయలుదేరానని రాహుల్ గాంధీ చెప్పారు. దాడులకు భయపడేది లేదని, రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగుతుందని రాహుల్ గాంధీ తెలిపారు.

లఖింపూర్ ఖేరి కి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి తీరుతాం
తనను, ప్రియాంక గాంధీని అడ్డుకున్నా, దాడులు చేసినా, అరెస్టు చేసినా తాము పట్టించుకోబోమని, రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని రాహుల్ గాంధీ విమర్శించారు. లఖింపూర్ ఖేరి కి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రైతులపై హత్యలకు పాల్పడుతున్నారని, లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి ఆయన కుమారుడి పేరు వస్తున్నా వారిపై కూడా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. లక్నోలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ కనీసం లఖింపూర్ కి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించలేదని పేర్కొన్నారు . బాధితులను పరామర్శించే హక్కు మాకు లేదా ? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

లఖింపూర్ ఖేరిలో ప్రతిపక్షాల పర్యటనను అడ్డుకుంటున్న యూపీ సర్కార్
గత కొన్ని రోజులుగా పలువురు ప్రతిపక్ష నాయకులు జిల్లాలో ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న క్రమంలో రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను లఖింపూర్ ఖేరీకి వెళ్ళకుండా సీతాపూర్‌లో 24 గంటల పాటు నిర్బంధంలో ఉంచిన తరువాత నిన్న సాయంత్రం అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ లక్నో విమానాశ్రయం నుండి బయటకు రాకుండా ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎయిర్ పోర్ట్ లో నేల పైన కూర్చుని తన నిరసనను తెలియజేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను 30 గంటల పాటు అతిథి గృహంలో నిర్బంధించిన తర్వాత అరెస్టు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై "సెక్షన్ 144 ఉల్లంఘన" క్రింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
Recommended Video

రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరణ.. ఏం జరుగుతుందో ? టెన్షన్
లఖింపూర్ ఖేరిలో ఆదివారం రైతు నిరసనకారుల సమూహంపై మంత్రి కాన్వాయ్ లో ఒక వాహనం దూసుకు రావడంతో నలుగురు రైతులు మరణించారు. ఆ తరువాత జరిగిన ఘర్షణలో మరో ఐదుగురు మృతి చెందారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానే ఈ ఘటనకు బాధ్యుడని ఆరోపిస్తూ మంత్రి కుమారుడిని అరెస్టు చేయడానికి రైతు సంఘం నాయకులు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరి పర్యటన నేపథ్యంలోఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications