తబ్లీఘీ జమాత్ చీఫ్ సాద్‌పై నేరిపూరిత హత్య కేసు: మౌలానా బంధువులకూ కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఖందల్వీ.. నేరపూరిత హత్య కింద క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఖందల్వీ ఉల్లంఘించారని, నిజాముద్దీన్ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా బారినపడి పలువురు మృతి చెందడానికి కారకులయ్యారని పోలీసులు స్పష్టం చేశారు.

నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మౌలానా సాద్ ఖందల్వీపై భారత శిక్షా స్మృతి సెక్షన్ 304 కింద, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపై వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. మౌలానా సాద్ తోపాటు మరో ఆరుగురు ఆఫీస్ బేరర్స్‌పై కేసు పెట్టారు. సాద్ క్వారంటైన్ పూర్తయిన నేపథ్యంలో నోటీసులు జారీ చేస్తామని చెప్పారు.

 Tablighi Jamaat chief faces culpable homicide case: his 2 relatives got corona positive

ఇధి ఇలావుండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్ జిల్లాలోని మౌలానా సాద్ బంధువులిద్దరికీ కరోనా పాజిటివ్ తేలడం గమనార్హం. దీంతో మరో ఎనిమిది మందిని క్వారంటైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ పొందిన ఇద్దరూ కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిఘీ జమాత్‌లో బసచేయడం గమనార్హం.

కాగా, తబ్లీఘీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొనడంతోపాటు అక్రమంగా దేశంలో ఉంటున్న 11 మంది విదేశీయులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాముద్దీన్ కార్యక్రమంలో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో జమాత్ వల్లే సగం కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+