శీలానికి వెల: ‘రేప్ మరిచిపోతే 41వేలు’ ఇస్తామన్న పంచాయతీ పెద్దలు
పాట్నా: ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ‘41వేల రూపాలయలు ఇస్తాము.. నీపై జరిగిన అత్యాచార ఘటనను మర్చిపో' అత్యాచార బాధిత మహిళకు ఓ పంచాయతీ పెద్దలు ఆదేశించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆమెను హెచ్చరించారు.
బీహార్ రాష్ట్రంలోని కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కాగా, నిందితుడు బాధితురాలికి ఆ మొత్తం నిరాకరించాడు. అంతేగాక నిరసన వ్యక్తి చేసిన బాధితురాలి భర్తకు నిప్పంటించాడు. దీంతో బాధితురాలి భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఇటీవల పని కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో ప్రకాశ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు. కటిహర్ జిల్లా ఎస్పీ క్షత్రనీల్ సింగ్ స్థానిక పోలీసులను నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
ఈ కేసులో నరేష్ రవిదాస్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ప్రధాన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా గతంలో నలుగురు అన్నదమ్ములు ఒక బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో బాధితురాలికి రూ. 50వేల పరిహారంగా ఇవ్వాలని పంచాయతీ పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications