నలుగురు రేప్, అమ్మాయి గర్భవతి: అబార్షన్‌కు రూ.50 వేలు ఆఫర్

Take Rs 50,000 and abort, Bihar panchayat tells raped girl
పాట్నా: ఓ అత్యాచార బాధితురాలి విషయంలో బీహార్ పంచాయతీ ఒకటి అన్యాయమైన న్యాయం చెప్పింది. నలుగురు సోదరులు ఓ యువతిపై అత్యాచారం చేశారు. దాంతో ఆమె గర్భవతి అయింది. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అయితే, 50 వేల రూపాయలు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలని పంచాయతీ ఆ బాధితురాలికి సూచించిందని పోలీసులు గురువారంనాడు చెప్పారు.

తమ గ్రామానికి చెందిన నలుగురు సోదరులుపై అమ్మాయిపై ఏడు నెలల క్రితం అత్యాచారం చేశారని, దాంతో ఆమె గర్భం దాల్చిందని, ఈ విషయాన్ని బాధితురాలితో పాటు ఆమె తల్లి తమకు చెప్పారని కిషన్ గంజ్‌ నుంచి పోలీసు అధికారి శ్వేతా గుప్తా ఫోన్‌లో ఆ వార్తా సంస్థ ప్రతినిధితో చెప్పారు.

తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గ్రామ పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసిందని, తనకు న్యాయం చేసి నిందితులకు శిక్ష వేయాలని అడిగిందని, అయితే వారు 50 వేల రూపాయలు తీసుకుని అబార్షన్ చేయించుకోవాలని బాధితురాలికి చెప్పారని, దాన్ని ఆమె నిరాకరించిందని గుప్తా వివరించారు. బీహార్ రాష్ట్రంలోని కిషన్‌గంజ్ జిల్లా పలష్మానీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

పదహారేళ్ల బాధితురాలు వలస కూలీ కూతురు. అతను రాజస్థాన్‌లో పనిచేస్తున్నాడు. బాధితురాలి తల్లి పొలాల్లో దినసరి కూలీగా పనిచేస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు. నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ సభ్యులు బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+