తలాక్ చెబుతానని బెదరించిన చిత్తూరు టెక్కి, బెంగళూరు భార్య కేసు, అక్రమ సంబంధం !

బెంగళూరు: అక్రమ సంబంధం కారణంగా తలాక్ చెప్పడానికి సిద్దం అయిన టెక్కీ భర్త మీద భార్య బెంగళూరులోని కేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుకు చెందిన రియాజ్ అనే ఇంజనీరు మీద ఆయన భార్య శబ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిత్తూరుకు చెందిన రియాజ్, శబ్నం దంపతులు బెంగళూరు చేరుకుని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నారు. రియాజ్ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. రియాజ్ వేరే మతం మహిళతో అక్రమ సంబంధం పెట్టున్నాడని శబ్నం ఆరోపించారు.

 Talaq Talaq Talaq:Wife who filed a complaint against her husband in Benagaluru.

తన భర్త రియాజ్ 15 రోజులు తనతో కాపురం చేస్తాడని, 15 రోజుల వేరే మతం మహిళతో కాపురం చేస్తున్నాడని అయినా తాను ఓపికగా ఉన్నానని శబ్నం పోలీసులకు చెప్పారు. అయితే తనను బెంగళూరు వదిలి చిత్తూరు వెళ్లిపోవాలని, లేదంటే తలాక్ చెబుతానని తన భర్త బెదిరిస్తున్నాడని శబ్నం పోలీసులను ఆశ్రయించారు.

తలాక్ ను దేశంలో నిషేధించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. తలాక్ నిషేదంపై చర్చ రాజ్యసభలో ఇంకా పెండింగ్ లో ఉంది. తలాక్ చెప్పేవారి మీద ఎలాంటి సెక్షన్ కింద కేసు నమోదు చెయ్యాలో అర్థం కాక పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+