ప్రధాని పేరు మరిచిపోయిన మంత్రి, పీఎం మన్మోహన్ సింగ్, పబ్లిక్ మీటింగ్ లో నోరుజారి, సెటైర్లు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ కి మన దేశ ప్రధాని ఎవరో కూడా తెలీదు అనే రీతిలో మాట్లాడారు. బహిరంగ సభలో భారతదేశ ప్రధాన మంత్రి మన్మోన్ సింగ్ మనకు ఎంతో సహకరిస్తున్నారని, ఆయన ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా మనకు సహాయం చేస్తున్నారని చెప్పి చివరికి నాలుక కరచుకున్నారు.

దిండిగల్ లో జరిగిన బహిరంగ సమావేశంలో మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ప్రసగించారు. ఈ సందర్బంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవడం వలనే తమిళనాడుకు ఎయిమ్స్ బృందం వచ్చిందని, డెంగ్యూ వ్యాది అరికట్టారని అన్నారు.

Tami Nadu Minister Dindigul Srinivasan refers Manmohan Singg as PM

వేదిక ముందు ఉన్న ప్రజలు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కదా అంటూ గట్టిగా కేకలు వేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినా మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ పట్టించుకోకుండా ప్రసంగిస్తూనే ఉన్నారు. వేదిక మీద ఉన్న ఓ నాయకుడు జోక్యం చేసుకుని మంత్రి చెవిలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ అసలు విషయం చెప్పారు.

తరువాత నాలుక కరచుకున్న మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని
కలవడం వలనే తమిళనాడుకు ఎయిమ్స్ బృందం వచ్చిందని, డెంగ్యూ వ్యాది అరికట్టడానికి సహరించారని చెప్పారు. ప్రధాని ఎవరు అనే విషయం గుర్తు లేని మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ ఇక తమిళనాడు ప్రజలకు ఏం సేవ చేస్తారు అంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu forests minister Dindigul Srinivasan, one of the senior leaders of the AIADMK, is at it again. This time, the minister, instead of saying deputy chief minister O Panneerselvam met prime minister Narendra Modi recently to seek the Centre's attention towards dengue, has said OPS had called on Manmohan Singh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి