modika pariwar: శరత్ కుమార్ కీలక నిర్ణయం, బీజేపీలో ఏఐఎస్ఎంకే విలీనం

చెన్నై: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ (Sarat Kumar) తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి(AISMK)ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. తన పార్టీ ఆఫీస్ బేరర్లతోపాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కమలం పార్టీలో విలీనం చేసిన విషయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా చెన్నైలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఐక్యతతోపాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ముందుకు నడిస్తున్నారని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసాగా నిలుస్తున్నారని కొనియాడారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు శరత్ కుమార్.

tamil actor sarathkumar merged his party AISMK with bjp

తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన నేపథ్యంలో శరత్ కుమార్ తన సోషల్ మీడియా ఖాాల్లో మోడీ కా పరివార్ అనే పదాన్ని జోడించడం గమనార్హం. కాగా, 1996లో డీఎంకేలో చేరడంతో రాజకీయ అరంగేట్రం చేసిన శరత్ కుమార్.. 2001లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

tamil actor sarathkumar merged his party AISMK with bjp

ఆ తర్వాత 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఏంకేకు రాజీనామా చేసి.. తన సతీమణి రాధికతో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. కానీ, కొద్ది నెలలకే అన్నాడీఎంకేను కూడా వీడారు. ఆ తర్వాత 2007 ఆగస్టులో ఏఐఎస్ఎంకే పార్టీని స్థాపించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు శరత్ కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఈ క్రమంలో శరత్ కుమార్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+