తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు (Tamil nadu assembly election 2026) ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదేళ్ల పాలన తర్వాత డీఎంకే కూటమి ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతకు తోడు, కొత్త పార్టీ రూపంలో విజయ్ విసురుతున్న సవాళ్లు సీఎం స్టాలిన్ కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే దీన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏ మేరకు ముందుందన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ వైబ్ సంస్థ ఓట్ ట్రాకర్ పేరుతో నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ లో (opinion poll) సంచలన విషయాలను వెల్లడించింది.

మీడియా ఛానల్ సీఎన్ఎన్-న్యూస్ 18కు విడుదల చేసిన ఓట్ వైబ్ ఒపీనియన్ పోల్ లో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీ ద్విముఖ పోరు తప్పదని తేల్చేసింది. డీఎంకే నేతృత్వంలోని అధికార కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ, మరియు సీపీఎంలతో కూడిన డీఎంకే కూటమి 113 నుండి 123 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమి కూడా 106 నుంచి 116 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు. విజయ్ కొత్త పార్టీ టీవీకే 2 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు.

Tamil Nadu 2026 Poll DMK and AIADMK Alliance Face a Razor-Thin Decisive Battle who is on edge

అటు గత ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు 40% మంది ప్రభుత్వ పనితీరును "మంచిది" లేదా "చాలా మంచిది" అని చెప్పారు. దాదాపు 39% మంది దానిని "పేలవమైనది" లేదా "చాలా పేలవమైనది"గా చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళలు డీఎంకే ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. 55 ఏళ్లు పైబడిన ఓటర్లు అత్యధిక స్థాయిలో ప్రభుత్వపై సంతృప్తి వ్యక్తం చేయగా, 18-24 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు కాస్త కోపంగా ఉన్నారు. సామాజిక వర్గాలలో, ఎస్సీ/దళితులు ప్రభుత్వాన్ని అత్యంత అనుకూలంగా చూస్తున్నారు. అయితే అగ్రవర్ణ హిందువులు అత్యంత అసంతృప్తితో ఉన్నారు.

Tamil Nadu 2026 Poll DMK and AIADMK Alliance Face a Razor-Thin Decisive Battle who is on edge

మైనారిటీ వర్గాలు సగటు కంటే ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. సీఎంగా స్టాలిన్ కు 39.9 శాతం మద్దతివ్వగా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి 37.5%తో ఆయన వెనుక ఉన్నారు. పురుషులు పళనిస్వామికి మొగ్గు చూపుతుండగా, మహిళలు స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్ష మహిళా ఓటర్లు ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య చీలిపోయారు. యువ ఓటర్లలో, ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో విజయ్‌కు గణనీయమైన మద్దతు లభిస్తోంది. వయోవృద్ధ ఓటర్లు ఎక్కువగా స్టాలిన్‌కు మద్దతుగా నిలవగా, మధ్య వయస్కులు పళనిస్వామి వైపు మొగ్గు చూపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+