జయ కేబినెట్ లోకి నలుగురు: గంటల్లో నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల తేడాలో తాను మంత్రి వర్గ విస్తరణ చేస్తున్నానని, అనుమతి ఇవ్వాలని గవర్నర్ రోశయ్యకు జావితా పంపించారు.
మంగళవారం గవర్నర్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జయలలిత కేబినెట్ లో కొత్తగా బెర్తులు ఖరారై వారిలో జీ. భాస్కరన్, పి. బాలక్రిష్ణారెడ్డి, నిలోఫర్, రామచంద్రన్ ఉన్నారు. వీరిలో ఇద్దరు మొదటి సారి శాసన సభ్యులుగా ఎన్నికైన వారు ఉన్నారు.

సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు జయలలిత మంత్రి వర్గం 32కు చేరనుంది. పలువురు సీనియర్ శాసన సభ్యులు, మాజీ మంత్రులకు ఈ సారి మంత్రి వర్గంలో స్థానం చిక్కలేదు.












Click it and Unblock the Notifications