జయ కేసు: న్యాయ శాఖ అధికారుల సమావేశం
బెంగళూరు: అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్నతమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత కేసుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కర్ణాటక న్యాయశాఖ అధికారులు చర్చించారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ సందర్బంగా ఎలా స్పందించాలనే విషయంపై చర్చించారు.
జయలలిత కేసులో కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై చర్చ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం సమర్పించిన అర్జీ, డీఎంకే నాయకుడు అన్బళగన్ సమర్పించిన అర్జీ ఒకే సారి విచారణకు వచ్చే అవకాశం ఉందని కర్ణాటక న్యాయ శాఖ అధికారులు అంటున్నారు.
కర్ణాటక హై కోర్టు జయలలిత కేసులో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తు కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే నాయకుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం సుప్రీం కోర్టులో కేసు విచారణ జరగనుంది. అంత లోపు కేసు విచారణకు అవసరం అయ్యే అన్ని సాక్ష్యాలను సిద్దం చేసుకోవాలని న్యాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications