జయలలిత ఆరోగ్య వివరాలు ఇవ్వండి: హైకోర్టు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. జయలలిత ఆరోగ్య వివరాలు వెల్లడించాలని తమిళనాడుకు ఆదేశాలు జారీ చెయ్యాలని ప్రముఖ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ వేశారు.
మంగళవారం మద్రాస్ హైకోర్టు పిటిషన్ పై విచారణ జరిపింది. బుధవారం లోపు జయలలిత ఆరోగ్య వివరాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య వివరాల నివేధిక లిఖిత పూర్వకంగా, లేదా మౌఖికంగా సమర్పించాలని చెప్పింది.

హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆరోగ్య వివరాలు వెల్లడించకుండా అన్నాడీఎంకే కార్యకర్తలు అందరిని అయోమయానికి గురి చేస్తున్నారని ట్రాఫిక్ రామస్వామి మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
