నేడు తమిళనాడు బంద్: రంగంలోకి ఆర్మీ బలగాలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జయలలిత ఆరోగ్యం విషమించడంతో అమ్మ అభిమానులు సోమవారం తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గర లక్షలాధి మంది అమ్మ అభిమానులు గుమికూడారు.

జయలలిత అభిమానులు తమిళనాడు బంద్ కు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా సోమవారం తమిళనాడులోని అన్ని వ్యాపార లావాదేవీలు నిలిపివేయాలని ఆయా సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ప్రయివేటు రవాణా సంఘ, సంస్థలు పరిస్థితులను పరిశీలించి సోమవారం ఉదయం నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.

army

ముందు జాగ్రత్త చర్యగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న అన్ని వాహనాలను చెన్నై నగర శివార్లలోనే నిలిపివేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లర్లుకు అవకాశం ఇవ్వకుండా చూడటానికి తమిళనాడు ఆదివారం అర్దరాత్రి నుంచి పోలీసులు నాకాబందీ కొనసాగిస్తున్నారు.

అమ్మ జయలలిత ఆరోగ్యం కుదటపడాలని ఆదివారం అర్దరాత్రి నుంచి తమిళనాడులో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. సోమవారం అర్దరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని పలు దేవాలయాల తలుపులు తీయించి పూజలు చేస్తున్నారు. రాత్రికిరాత్రి చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో రోడ్లలోనే హోమాలు చేస్తూ అమ్మ ఆరోగ్యం కుదటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.

రంగంలోకి మిలటరీ బలగాలు !

జయలలిత ఆరోగ్యం విషమించడంతో జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితులు అదుపుతప్పుతాయని భావించిన ప్రభుత్వ పెద్దలు రంగంలోకి పార మిలటరీ బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఆదివారం అర్దరాత్రి నుంచి పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగడానికి సిద్దం అయ్యాయి.

Jjalalithaa

చెన్నై నగరంతో సహ దక్షిణ, ఉత్తర తమిళనాడులోని సున్నితమైన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను మొహరించడానికి అన్నీ సిద్దం చేశారు. వారం రోజుల పాటు పారా మిలటరీ బలగాలను మొహరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా అమ్మ వీరాభిమానులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మిలటరీ బలగాలను పంపించారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+