చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మ కాల్ సెంటర్ 24 గంటలు రింగ్ రింగ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అమ్మ కాల్ సెంటర్ ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా అమ్మ కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. చెన్నైలోని టీ నగర్ లో అమ్మ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

ఈ అమ్మ కాల్ సెంటర్ ను సచివాలయం నుంచి ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. అమ్మ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1100 ఫోన్ చెయ్యడం ద్వారా ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయాన్ని అందుకోవచ్చని జయలలిత చెప్పారు.

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ పరంగా తాము ఆశిస్తున్న సేవలు, సమస్యల పరిష్కారాల కోసం సచివాలయంలో సీఎం ప్రత్యేక విభాగం పని చేస్తుంది. అమ్మ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల ద్వార విభజిస్తారు.

వెంటనే పరిష్కారం

వెంటనే పరిష్కారం

సంబంధిత శాఖలకు ఫిర్యాదులను పంపిస్తారు. సమస్య పరిష్కారం అయిన తరువాత వెంటనే సంబంధిత వ్యక్తికి ఎస్ఎమ్ఎస్ ద్వారా సమాచారం ఇస్తారు.

మరింత వేగం

మరింత వేగం

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మరింత వేగం పాటించేందుకు వీలుగా అమ్మ కాల్ సెంటర్ సేవలు ప్రారంభించామని ముఖ్యమంత్రి జయలలిత అంటున్నారు.

24 గంటలు పని చేస్తుంది

24 గంటలు పని చేస్తుంది

అమ్మ కాల్ సెంటర్ ప్రతి రోజు 24 గంటలు పని చేస్తుంది. ప్రజలు వారి సమస్యలను అమ్మ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి విన్నవించుకునే వెసులుబాటు కల్పించారు.

రోజుకు 15 వేల ఫిర్యాదులు

రోజుకు 15 వేల ఫిర్యాదులు

చెన్నైలోని అమ్మ కాల్ సెంటర్ లో ప్రతి రోజు 15,000 ఫిర్యాదులు నమోదు చెయ్యడానికి సామర్థ్యం కల్పించారు. 138 మంది ఉద్యోగులను అక్కడ నియమించారు.

అమ్మ క్యాంటీన్లు

అమ్మ క్యాంటీన్లు

నామమాత్రం ధరకు ఆహారం లంభించే అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో బహుళ ప్రజాదణపొందింది. ఇతర రాష్ట్రాలకు సైతం ఈ క్యాంటీన్లు ఆదర్శంగా నిలిచాయి.

అమ్మ పథకాలు

అమ్మ పథకాలు

అమ్మ క్యాంటీన్లు, అమ్మా సిమెంట్, అమ్మ మినరల్ వాటర్ బాటిల్స్, అమ్మ ఫార్మసీలు, అమ్మ ఆముదం స్టోర్లు తదితర సేవలు అందిస్తున్నాయి.

అమ్మ థియేటర్లు

అమ్మ థియేటర్లు

అమ్మ థియేటర్లు ఏర్పాటు చెయ్యడానికి చెన్నై కార్పొరేషన్ ప్రణాళికలు సిద్దం చేసింది.

అన్ని ప్రజాదరణ పొందాయి.

అన్ని ప్రజాదరణ పొందాయి.

అమ్మ పథకాలు అన్నీ ప్రజాదరణ పొందాయి. పలు పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.

ఎన్నికల వేళ

ఎన్నికల వేళ

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వీలైనన్ని కొత్త పథకాలను ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

విమర్శలు

విమర్శలు

ప్రభుత్వం ప్రవేశ పెట్టే అన్ని పథకాలకు అమ్మ అనే పేరు ముందు తగిలిస్తూ ఫ్రీగా ప్రచారం చేసుకుంటున్నారని ప్రతిపక్షాల నాయకులు మండిపడుతున్నారు.

English summary
Tamil Nadu Chief J Jayalalithaa on Tuesday launched a round the clock call centre for ensuring fast response to grievances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X