Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోతున్న లెక్కలు-తాజా సర్వేలో తేల్చేసిన ఓటర్లు..!

తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Election 2026) జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి డీఎంకే, అన్నాడీఎంకే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఉత్తరాదిలో వరుసగా గెలుపులు సాధిస్తున్న బీజేపీకి తమిళనాడులో గెలుపు అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. దీంతో తమిళనాడు ఓటర్ల నాడి తెలుసుకునేందుకు పలు సర్వే (survey) సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇదే క్రమంలో తాజాగా ఇన్ సైడ్ ఎలక్షన్ అనే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తమిళనాడులో మరోసారి హోరాహోరీ పోరు నెలకున్నా ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే ఉండబోతున్నట్లు తేలిపోయింది. అధికార డీఎంకేకు ఓటర్లు మరోసారి అధికారం కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చిసింది. విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మరోసారి అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోతున్నట్లు నిర్ధారణ అయింది. అలాగే విజయ్ ప్రభావం కూడా లేదని తేలిపోయింది.

Tamil Nadu Election 2026 Inside Election Survey Asks Which Alliance Is Hanging By a Thread

234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి డీఎంకేకు 159-165 సీట్లు లభించబోతున్నట్లు ఇన్ సైడ్ ఎలక్షన్ సంస్థ తమ సర్వే ఫలితాల్లో తెలిపింది. అలాగే అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 64-70 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. విజయ్ పార్టీ టీవీకే కేవలం 4-6 సీట్లతో సరిపెట్టుకోక తప్పదని ఈ సర్వేలో పాల్గొన్న ఓటర్లు తేల్చేశారు. అలాగే డీఎంకే కూటమికి ఈసారి 44 శాతం మంది ఓటర్ల మద్దతు లభిస్తోందని, అన్నాడీఎంకే కూటమికి కేవలం 33 శాతం మంది ఓటర్లే మద్దతిస్తున్నట్లు తేలింది. విజయ్ పార్టీ టీవీకే కు 18 శాతం మంది ఓటర్లు అండగా నిలుస్తున్నారు. ఎన్టీకేకు 3 శాతం, ఇతరులకు 2 శాతం ఓటర్లు మద్దతిస్తున్నారు.

Tamil Nadu Election 2026 Inside Election Survey Asks Which Alliance Is Hanging By a Thread

ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరికి ఓటేస్తారన్న ప్రశ్నకు ఎంకే స్టాలిన్ కు 44 శాతం మంది, పళనిస్వామికి 28 శాతం మంది, విజయ్ కు 24 శాతం మంది, సీమన్ కు 3 శాతం మంది, ఇతరులకు ఒక్క శాతం ఓటర్లు మద్దతిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు 30 శాతం ఓటర్లు చాలా బాగుందని, 20 శాతం బాగుందని, 25 శాతం యావరేజ్ అని, 15 శాతం మంది బాగోలేదని, 10 శాతం మంది అస్సలు బాగోలేదని తేల్చిచెప్పేశారు. డీఎంకే ప్రభుత్వం కొనసాగాలా అన్న ప్రశ్నకు 55 శాతం మంది అవునని, మార్పు కావాలని 25 శాతం మంది, ఏమీ చెప్పలేం అని మరో 20 శాతం మంది చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+