పన్నీర్, స్టాలిన్ లపై రైతులు ఫైర్: 14 రోజులు, ఢిల్లీలో ఎలుకలు తింటూ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/చెన్నై: కావేరీ నీరు పంపిణి విషయంలో మాకు న్యాయం జరగాలంటే వెంటనే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు 14 రోజులకు చేరింది.

ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు సోమవారం ఢిల్లీ చేరుకుని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న తమిళనాడు రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కావేరీ నీరు పంపిణి విషయంలో తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఆ రాష్ట్రానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు.

Tamil Nadu Farmers eat rat in their protest at Jantar Mantar in Delhi,

కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాలసిన కావేరీ జలాలు సక్రమంగా పంపిణి జరగాలంటే కచ్చితంగా కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గత 14 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర అర్దనగ్నంగా ధర్నాలు చేస్తున్న తమిళనాడు రైతులు సోమవారం ఎలుకలు తింటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు, రైతులు తమిళనాడు రైతులకు మద్దతు ప్రకటించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకే పరిమితం అయ్యారని. కనీసం ఢిల్లీకి వచ్చి మాకు మద్దతు ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం అలర్ట్ అయ్యారు. రైతుల డిమాండ్లను వెంటనే తీర్చాలని, తమిళనాడుకు రావాల్సిన నిధులు విడుదల చెయ్యాలని సోమవారం పన్నీర్ సెల్వం చెన్నైలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TN Farmers are protesting in Delhi for past 14 days. But MK Stalin and O.Panneer selvam are focusing only on RK Nagar and they are not going to Delhi to support farmers
Please Wait while comments are loading...