Video: బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు: ఐదుగురు సజీవ దహనం, మరో 10 మందికి గాయాలు
చెన్నై: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లకురిచి జిల్లా శంకరపురంలోని ఓ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో పది మందికిపైగా గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. జిల్లా కలెక్టర్ పీఎన్ శ్రీధర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడేవున్న కొందరు అందుకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించారు. ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. భయంతో రోడ్డుపై వాహనాలు కూడా కాసేపు అక్కడే నిలిచిపోయాయి.
పెద్ద ఎత్తున బాణాసంచా పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. బాణాసంచా దుకాణం ముందు పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహనం కూడా మంటల్లో దగ్ధమైపోయింది. కాగా, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ పరిశ్రమలున్నాయి. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండటం గమనార్హం.
கள்ளக்குறிச்சி: சங்கராபுரம் பகுதியில் பட்டாசு விற்பனை கடையில் ஏற்பட்ட தீ விபத்தில் 4 பேர் உயிரிழப்பு
— தமிழ் தேசம் (@tamizhdhesam) October 26, 2021
.#tamizhdhesam
.
Follow us
IG : FB : TW : YT:TG :: @tamizhdhesam
. #tamil #tamilnadu #sivakashi #diwali #Kallakurichi #Kallakurichi #Fireaccident #crackers #india #tamilmemes pic.twitter.com/ZWtiDLXgKC
Recommended Video
సెప్టెంబర్ 10న విరుధ్ నగర్ జిల్లాలోని తయిలపట్టిలోని బాణాసంచా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలోనే గత జూన్ నెలలో అక్రమ బాణాసంచ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇలాంటి ప్రమాదంలోనే ఏడుగురు మహిళలు సజీవదహనమయ్యారు.












Click it and Unblock the Notifications